ఊహాగానాలు మరియు అంచనాలతో ఏపీలో ఎన్నికల సమయం గురించి చర్చలు పెరుగుతున్నాయి. చూస్తూండగానే 2023 చరిత్ర పుటలలోకి వెళ్ళిపోతోంది. 2024 మరి కొద్ది రోజులలో మొదలవుతోంది. 2024 వచ్చింది అంటే ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టినట్లే. 2019 ఎన్నికల్లో కూడా ఇలాంటి వాడి వేడి కనిపించింది.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మరో మూడు నెలలు అని అంతా ఒక అంచనాతో మాట్లాడుతున్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయి పరీక్షలు సాధారణం కంటే పదిహేను రోజుల ముందుగానే నిర్వహించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మునుపటి విద్యా సంవత్సరంలో, ఈ పరీక్షలు మార్చి 15 తర్వాత ఏప్రిల్ ప్రారంభ వారంలో జరిగాయి. అయితే ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి మొదటి తేదీన ప్రారంభించి మార్చి 20వ తేదీతో ముగించాలనే ఉద్దేశంతో విద్యాశాఖ అధికారులు ప్రచారాన్ని ప్రారంభించారు.
అదే విధంగా టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచి మొదలెట్టి ఆ నెలాఖరుతో ముగించనున్నారు. దీంతో ఈ పరీక్షలు ముందుకు జరగడం అంటే ఎన్నికల షెడ్యూల్ కోసమే అని అంటున్నారు. మార్చి లో ఏపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అవుతుంది అని అంటున్నారు. దానికి ప్రిపరేషన్ గానే ఈ పరీక్షల షెడ్యూల్ మార్పు అని అంటున్నారు.
ఇది కూడా చదవండి..
భారీగా పెరిగిన బియ్యం ధరలు.. క్వింటాకు రూ.800 పెరుగుదల..!
ఇలా గత ఎన్నికల షెడ్యూల్ ఉంది. అపుడు కూడా లోక్ సభ ఎన్నికలతో ఏపీ ఎన్నికలను కలిపి నిర్వహించారు. దాన్ని రెండు నెలల పాటు ఏకబిగిన ఎన్నికలు దేశవ్యాప్తంగా సాగాయి. ఏపీలో అయితే దాదాపుగా మూడు నెలల పాటు ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈసారి కూడా ఏపీ నుంచే ఎన్నికలు తొలిదశగా లోక్ సభకు నిర్వహిస్తూ దాంతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు అని అంటున్నారు.
నివేదికల ప్రకారం, ఎన్నికల షెడ్యూల్ మరియు రాబోయే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి నెలలో అధికారికంగా ప్రకటించబడుతుందని విస్తృతంగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఏపీలో అయితే దాదాపుగా మూడు నెలల పాటు ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈసారి కూడా ఏపీ నుంచే ఎన్నికలు తొలిదశగా లోక్ సభకు నిర్వహిస్తూ దాంతో పాటే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు అని అంటున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments