కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ప్రయోజనం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన క్రాప్ లోన్స్, ఇన్ పుట్ సబ్సిడీ, రైతు బీమా సబ్సిడీ ఎరువులు, విత్తనాలు పురుగుమందులు, పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం వంటి సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి రైతుకు అందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పంట లెక్కల సమాచారాన్ని పక్కాగా సేకరించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక సర్వే చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
రైతులు ఏ పంటలను ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారు అన్న సమాచారాన్ని పక్కాగా తీసుకోవడం వల్ల రైతులకు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయం, పథకాల అమల్లో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సీజన్లో రైతులు ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. వాటికి ఏ విధంగా మద్దతు ధర కల్పించాలి. అలాగే ఏ ప్రాంతంకి ఎంత యూరియా , డీఏపీ విత్తనాలు ఎంత మోతాదులో అవసరం అవుతాయో ముందుగా తెలియజేయడం వల్ల ఎరువులు ,విత్తనాల కొరతను కూడా అధిగమించవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
అంతేకాదు పంట పండించాక ఆయా పంటలకు
మద్దతు ధర కల్పించడంలోను మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టవచ్చనని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు పంట
లెక్కలను గ్రామాల్లో ఎవరో ఒకరి ద్వారా సేకరించి సమాచారాన్ని నేరుగా వ్యవసాయ అధికారులకు పంపడం జరిగేది.
అలా సేకరించిన పంట సమాచారంలో స్వస్థత ఉడదన్న భావన చాలా మంది వ్యక్తం చేస్తున్న తరుణంలో వ్యవసాయశాఖ కొత్త సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం స్థానిక ఏఈవో స్వయంగా వారి గ్రామాల పరిధిలోని రైతు పొలం వద్దకు వెళ్లి ఏ విధమైన పంట సాగు చేస్తున్నారో తెలుసుకొని పక్కాగా లెక్కలు నమోదు చేసి ఆ సమాచారాన్ని వ్యవసాయశాఖ పోర్టల్‌లో పొందుపరుస్తారు.
Share your comments