అన్నయ్య జిల్లా మదనపల్లె కు చెందిన రైతు కాశ్మిరీ కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు. వినడానికి వింతగ ఉన్న ఇది వాస్తవం. ఇప్పుడు కుంకుమపువ్వు సాగు కోసం కాశ్మిరీ వెళ్ళవలసిన అవసరం లేదు. కాశ్మిర్ యొక్క వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి ఆసక్తి ఉంటె పండించవచ్చు. అంతే కాకుండా ఎక్కువ దిగుబడులను కూడా సాధించవచ్చు. వ్యవసాయ పట్టభద్రురాలు శ్రీనిధి ఎవరు ఉఊహించని విధంగా కాశ్మిరీ కుంకుమ పువ్వును సాగు చేస్తు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు .
2022, ఆగస్టు 20వ తేదీన ప్రారంభించిన కుంకుమపువ్వు సాగు నవంబర్ 20కి అనగా సరిగ్గా మూడు నెలలకి తుదిదశకు చేరుకుంది. 30,000 మొక్కలలో దాదాపుగా 20,000 మొక్కలు అంటే ఏడు గ్రాములుకు పైన ఉన్న విత్తనాలు మాత్రమే పువ్వు దశకు చేరుకున్నాయి. సాధారణంగా ఒక గ్రాము కుంకుమపువ్వు దిగుబడికి 150 పువ్వులు అవసరం అవుతాయి.
శ్రీనిధి తొలి ప్రయత్నంలోనే 200 గ్రాముల కల్తీలేని , నాణ్యమైన ఏ గ్రేడ్ కుంకుమపువ్వును పండించారు. ఇది కాశ్మిమిర్లో సాంప్రదాయక సాగు పద్దతిలో వచ్చే దిగుబడితో సమానం.
బడ్జెట్ 2023: రూ. 7 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు
కుంకుమపువ్వు సాగు కోసం శ్రీనిధి 300 కిలోల నాణ్యమైన విత్తనాలను కాశ్మిర్ నుండి కొనుగోలు చేసారు. 300 కిలోలలో 250 కిలోల విత్తనాలను సాగుకు వినియోగించారు. సాగును కోసం ఇంట్లోనే కాశ్మిర్ తరహా వాతావరణ పరిస్థితులను ఏర్పాటు చేసారు. ఏరోఫోనిక్ పద్ధతిలో సుమారు 30,000 ట్రేలలో విత్తనాలను ఆ గదిలో ఉంచారు.
Share your comments