
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల లో ప్రశ్నోతరాల సమయంలో , రైతు రుణాలపై ప్రతి పక్షాలు అడిగిన ప్రక్షకు సమాధామిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి సహకార సంస్థలు , బ్యాంకు ల ద్వారా ఆరులైన రైతులకు పంట రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు ,రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1. 63 లక్షల కౌలు రైతులకు పంట రుణాలను అందించినట్లు మంత్రి తెలిపారు .
అంతే కాకుండా రైతులకు రైతు భరోసా , సున్నా వడ్డీ , సబ్సిడీ పై రుణాలను కూడా అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు సాగు దారుల పరిరక్షణ చట్టం క్రింద 5. 49 లక్షల రైతులకు పట్టాలను కూడా అందించామన్న మంత్రి వారిలో ఇప్పటికే 1. 63 లక్షల కౌలు రైతులకు పంట రుణాలను బ్యాంకుల ద్వారా పొందినట్లు తెలిపారు .
అడంగల్ లో నమోదు చేసుకున్న రైతులందరికీ న్యాయం జరిగిలే చర్యలు తీసుకుంటాం అన్నారు మంత్రి .
వ్యవసాయ శాఖకు కేటాయించిన బడ్జెట్ :
వ్యవసాయ శాఖకు రూ.12,450 కోట్లు కేటాయింపు.
పగటి పూట రైతులకు 9 గంటల పాటు నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగుతోందని తెలిపారు. విద్యుత్ సబ్సిడీ కోసం రూ.5,500 కేటాయింపు. ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్లు విలువైన ఎరువుల పంపిణీ.
రైతుల కోసం వ్యవసాయ సహాయక మండళ్లు ఏర్పాటు.విత్తనాల పంపిణీ కోసం రూ.220 కోట్లు కేటాయింపు.
వ్యవసాయ రుణాల కింద 9 లక్షల మంది రైతులకు లబ్ది జరిగిందన్న మంత్రి. వైఎస్సాఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించామని, ఈ పథకం కోసం రూ.1,442 కోట్లు కేటాయింపు.
రైతులకు ఉచిత పంటల బీమా కోసం రూ. 1,600 కోట్లు ప్రతిపాదించినట్టు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ రూ.6,400 కోట్లు నాలుగేళ్లలో అందజేసినట్టు తెలిపింది.
మినీ బ్యాంకులుగా రేషన్ షాపులు.. డబ్బులు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు ..
మత్స్య శాఖ కోసం రూ.538 కోట్లు కేటాయింపు. పశు సంవర్ధక శాఖకు మొత్తం రూ.1,114 కోట్లు కేటాయింపు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.472 కోట్లు. డాక్టర్ వైస్సాఆర్ ఉద్యానవన యూనివర్సిటీ కోసం రూ.102 కోట్లు..వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.138 కోట్లు.. ఏపీ మత్స్య యూనివర్సిటీకి రూ.27 కోట్లు
ఉద్యానవన శాఖకు మొత్తం రూ.664 కోట్లు కేటాయింపు.
Share your comments