అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనె ధరలు నిత్యం తగ్గుతూనే వున్నాయి కానీ భారతీయ మార్కెట్లో ధరలు గత కొంత కాలంగా ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి .రోజు రోజు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు శుభవార్త అందించండి ప్రభుత్వం . అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు తగ్గు ముఖం పడుతున్న వేళ వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం గతం లో ఆదేశించింది.
అయితే ఇప్పుడు వంటనూనె ధరలను తగ్గించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. సన్ ఫ్లవర్, సోయాబీన్ నూనె దిగుమతులపై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సన్ ఫ్లవర్‌పై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీలో 17.5 శాతం, సోయా బీన్ వంటనూనెపై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీలో 12.5 శాతం మేర తగ్గించింది.
మరో రూ.10 తగ్గినా మదర్ డెయిరీ వంట నూనె ధర ..
ప్రభుత్వం గతంలో విధిస్తున్న అగ్రిస్స్ ను కు కూడా ఎత్తేసిన ప్రభుత్వం రోజు రోజు పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న వినియోగదారులకు శుభవార్త అందించింది.అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు తగ్గు ముఖం పడుతున్న వేళ వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.గతంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో నూనె ధరలు 43 తగ్గాయి దీనితో ప్రభుత్వం 55 శాతం సెన్స్ ను తగ్గించింది అయినా వంట నూనె ధరలు తగ్గడం లేదు తాజాగా ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీలో 17.5 శాతం తగ్గించడం తో వంటనూనె దహార్లు తగ్గుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలను తగ్గించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ధరలు ఎప్పటివరకు తగ్గుతాయో వేచిచూడాలి.
Share your comments