
ప్రతి గ్రామీణ కుటుంబం కనీసం రూ.1 లక్ష ఆదాయం పొందేలా వ్యవసాయం, అనుబంధ రంగాల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు (₹1 lakh income rural plan) రూపొందించాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా స్థాయి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఇతర అనుబంధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పనస పంటకు 110 ఎకరాల ప్రణాళిక (Jackfruit farming Andhra Pradesh)
కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 110 ఎకరాల్లో పనస పంట సాగు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ పంట ద్వారా రైతులకు, గ్రామీణ కుటుంబాలకు స్థిర ఆదాయం లభించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పనస పండ్లు నూటికి నూరు వేలు మార్కెట్ డిమాండ్ ఉన్నందున, వాటి ప్రాసెసింగ్ ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులు చేసేందుకు అవకాశాలున్నాయని వివరించారు (jackfruit processing India).
చెరువుల కింద కొబ్బరి సాగు (Parvathipuram collector agri scheme)
రిజర్వాయర్లు, చెరువుల కింద దాదాపు 3,000-4,000 ఎకరాల భూమిని ఉపయోగించి, ఉపాధి హామీ పథకంలో భాగంగా కొబ్బరి సాగు చేపట్టి గ్రామ ఐక్య సంఘాలకు భాద్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఇలా చేయడం ద్వారా గ్రామ స్థాయిలో సమూహ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చిరుధాన్యాలపై దృష్టి – మార్కెట్ డిమాండ్ గల పంటలు
పార్వతీపురం జిల్లాలో చిరుధాన్యాల సాగుకు అనుకూల వాతావరణం, నేలలు ఉన్నాయని అధికారులు నివేదించగా, కలెక్టర్ మంచి ధరలు లభించే ఈ పంటల (value-added farming) సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సాహకంగా వ్యవహరిస్తుండటంతో, మార్కెట్‌లోనూ డిమాండ్ పెరుగుతోంది.
ఆహార భద్రతతో పాటు ఆదాయం లక్ష్యం
రానున్న రబీ సీజన్ కోసం జిల్లాకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, అందులో పంటల విస్తీర్ణం, రైతుల భాగస్వామ్యం, మార్కెటింగ్ యోచనలు తదితర అంశాలపై స్పష్టత ఉండాలని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం (rural income growth 2025) లో పశుపోషణ, కూరగాయల సాగు, గ్రీన్‌హౌస్ పద్ధతుల్లో సాగు వంటి రంగాల్లోనూ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు (income diversification AP).
సమావేశంలో పాల్గొన్నవారు
ఈ సమావేశంలో నాబార్డ్ డిడిఒ డిఎస్ దినేష్ కుమార్ రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ ఎం. సుధారాణి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి. శ్యామల, సూక్ష్మ సాగునీటి ప్రాజెక్టు అధికారి వి. రాధాకృష్ణ, అగ్రి ట్రేడ్ మరియు మార్కెటింగ్ అధికారి ఎల్. అశోక్ కుమార్, ప్రకృతి సిద్ధ మొక్కల నిపుణుడు టి. శివకేశవరావు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Read More:
Share your comments