రైతులు అనుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయని సీఎం కేసీఆర్ సంచలన వాక్యాలు చేసారు.
రైతులు కోరుకుంటే ప్రభుత్వాన్ని మార్చవచ్చునని, తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రాజ్యాంగ బద్ధంగా హామీ ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు చండీగర్ లో జరిగిన కార్యక్రమం లో అన్నారు.గత ఏడాది రైతుల పోరాటం, గాల్వాన్‌లోయలో జరిగిన ఘర్షణల్లో అమరులైన రైతుల కుటుంబాలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఆయన వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ఉన్నారు. మృతుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని కేసీఆర్ అన్నారు. రోజూ చాలా మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. కానీ నేడు ప్రతి రైతుకు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది.
రైతుల పొలాల్లో కరెంట్ మీటర్లు:
రైతుల పొలాల్లో కరెంట్ మీటర్లు అమర్చి విద్యుత్ చార్జీలను వసూలు చేసే విషయం పై స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ మీటర్లు అమర్చే అవకాశం కానీ ఉద్దేశ్యం కానీ లేదన్నారు.కేంద్రం యొక్క మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల బంధువులకు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేసారు.
వీరమరణం పొందిన వారిని తిరిగి తీసుకురాలేము, కానీ మేము మీకు మద్దతు ఇస్తాము. దేశం మొత్తం మీ వెంటే ఉంది’’ అని అమరవీరులకు, వారి కుటుంబాలకు నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా, 24 గంటల కరెంటు వంటి తదితర పథకాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రసంగించారు
మరిన్ని చదవండి.
Share your comments