News

తాలు ,తరుగు తీస్తే కఠిన చర్యలు; ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ !

Srikanth B
Srikanth B
తాలు ,తరుగు తీస్తే కఠిన చర్యలు; ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ! Image credit : Decan chronical
తాలు ,తరుగు తీస్తే కఠిన చర్యలు; ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ! Image credit : Decan chronical

ఆరుగాలం శ్రమించి రైతులు పంట పండిస్తే తాలు ,తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు తాలు, తరుగు పేరిట మీడియా కథనల్లో వస్తున్న వార్తలపై విచారణ జరిపి వాస్తవ పరిస్థితులు నివేదించా లని కలెక్టర్లను కమిషనర్ ఆదేశించారు, ఈమేరకు నిన్న తాలు, పేరుతో తరుగు తీసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లయ్స్ కమిషనర్ వి.అనిల్ కుమార్ హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలనుంచి వస్తున్న ధాన్యాన్ని వెంటనే దించుకోవాలని ఆదేశించారు .

తెలంగాణాలో ధాన్యం కొనుగోలు ప్రారంభంకాగానే రైతుల నోటినుంచి వచ్చే ఒకే ఒక మాట తాలు ,తరుగు పేరుతో వడ్ల కొనుగోలులో కోతలు విదిస్తున్నారని , క్వింటాలుకు కనిష్టంగా 3 నుంచి 5 కిలోలవరకు కోతలు విధిస్తున్నారని రైతులు తమ ఆవేదనలను వెళ్లబోస్తుంటారు , అధికారులు అన్ని సార్లు మిల్లర్లను హెచ్చరించిన పరిస్థితులు ఎక్కడిక్కడే వున్నాయి మిల్లర్ల కోతలు కొనసాగుతూనే వున్నాయి .

తాలు, తరుగు పేరుతో మిల్లర్ల నుంచి సమస్యలు ఎదురవుతే పరిష్కరించడానికి ప్రతీ జిల్లా కేంద్రంలో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామని, అదే విధంగా, హైదరాబాద్లోని సివిల్సప్లయ్స్ భవన్లో 1967,180042500333 టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశామని, ఈ ఏడాదిలో 25.35లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు.

ఇది కూడా చదవండి .

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కాపాడుకోండి ఇలా !

జగిత్యాల లో ఒక రైతు ఆవేదన :

30రోజులు అవుతుంది నేను పంటను కోసి. 6 ఎకరాల వడ్లు ఇక్కడ నిల్వకు ఉంచాం. వర్షాల కారణంగా కొనుగోళ్లు జరగలేదు. మా వడ్లు జోకి పది రోజులు అవుతోంది . ఇక తూకం వేస్తుండగా తరుగు పేరుతో కోత విధిస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో ఎంతో నష్టపోయాం. మద్దతు ధర లేక ఇంకా నష్టపోతున్నాం. ఇక తేమ, తరుగు పేరుతో కోతలు విధిస్తే మేమెట్లా బతకాలి అని రైతులు వాపోతున్నారు .

ఇది కూడా చదవండి .

అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కాపాడుకోండి ఇలా !

Share your comments

Subscribe Magazine

More on News

More