ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి మార్కెట్ యార్డుకు గుంటూరు మిర్చి యార్డు , మిర్చి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఎగుమతులు భారీగ తగ్గాయి .. గుంటూరు మార్కెట్ భారతదేశం లోనే అతిపెద్ద మిర్చి ఎగుమతి దారులలో గుంటూరు మార్కెట్ యార్డు నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణ కొరియా, లుక్, సౌత్ ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా వంటి దేశాలకు ప్రధానంగా మిర్చి మరియు మిర్చి పొడి ఇక్కడి నుంచే ఎగుమతి అవుతుంది .
అయితే ఈ సంవత్సరం అకాలవర్షాలు , తెగుళ్ళ కారణంగా మిర్చి ఉత్పత్తి గణనీయంగా తగ్గింది దీనితో . పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి మార్కెట్టుకు వచ్చే మిర్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోవడంతో గుంటూరు మార్కెటుకు ఆశించినంత స్థాయిలో మిర్చి రాలేదు అని అధికారులు చెబుతున్నారు .
పెరిగిన వేరుశెనగ ధర క్వింటాకు రూ.7,370..
ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో జనవరి నెలలో 5, 81, 716 క్వింటాళ్ళు, ఫిబ్రవరిలో 9,55273 క్వింటాళ్ళు, మార్చి నెలాఖరుకు 7,54, 189, ఈ నెలలో 1,40,876 టిక్కీలు యార్డుకు తీసుకొచ్చారు ఇటీవల కురిసిన అకాలవర్షాలు , తెగుళ్ల దాడితో దిగుబడులు తగ్గి రానున్న నెలలో మరింత తక్కువగా మిర్చి మార్కెట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ యార్డు అధికారులు అంచనాలు వేస్తున్నారు . ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరు వరకు శీతల గోదాములకు 75 లక్షల టిక్కీల వరకు వస్తుండగా, ఈఏడాది 35 లక్షల నుంచి 40 లక్షల టిక్కీలు మాత్రమే వచ్చాయి. గతంతో పోల్చితే ఇప్పటివరకు 50శాతం మాత్రమే నిండాయని మార్కెట్ యార్డు నిర్వాహకులు చెబుతున్నారు .
Share your comments