పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తను అందించింది. రబీ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024-2025 రబీ సీజన్‌లో గోధుమ, బార్లీ, సన్ ఫ్లవర్, శనగ, ఆవాలు, మసూర్ సహా ఆరు ముఖ్యమైన పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం 2024-25 రబీ సీజన్‌కు గోధుమల కనీస మద్దతు ధరను రూ. 150 పెంచడంతో క్వింటా గోధుమల ధర రూ.2,275కు చేరింది. బార్లీ ధరను రూ.115 పెంచడంతో క్వింటాల్ ధర రూ.1,850 కి చేరింది. శనగ కనీస మద్దతు ధరను రూ.105 పెంచారు. ఈ పెంపుతో క్వింటా శనగ ధర రూ.5440 కి పెరిగింది.
మసూర్ పంట మద్దతు ధర రూ.425 పెంచడంతో క్వింటాల్ ధర రూ. 6,425 కి చేరింది. ఆవాల మద్దతు ధర రూ.200 పెంచడంతో క్వింటాల్ ధర రూ.5,650కి చేరింది. కుసుమ పంట మద్దతు ధర రూ. 150 పెంచడంతో క్వింటాల్ ధర రూ. 5,800కి చేరింది. ఆరు పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..
'నిజం గెలవాలి' పేరుతో ప్రజాక్షేత్రంలోకి ప్రయాణించనున్న నారా భువనేశ్వరి..
అలాగే, కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం యొక్క ప్రయోజనాలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు విస్తరించడానికి ప్రభుత్వం కిసాన్ రిన్ పోర్టల్ (KRP), KCC ఘర్ ఘర్ అభియాన్ మరియు వాతావరణ సమాచార నెట్‌వర్క్ డేటా సిస్టమ్స్ (WINDS)లను ప్రవేశపెట్టింది. రైతులు తమ పంటల గురించి సకాలంలో నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పించేందుకు సకాలంలో మరియు ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని అందించడం దీని లక్ష్యం.
ఈ కార్యక్రమాలు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు, ఆర్థిక చేరికలను మెరుగుపరచడం, డేటా వినియోగాన్ని మెరుగుపరచడం మరియు దేశవ్యాప్తంగా రైతుల జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి..
Share your comments