News

ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ స్కూళ్లలో సెల్‌ఫోన్లు బ్యాన్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ..

Gokavarapu siva
Gokavarapu siva

పాఠశాలల్లో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు మొబైల్‌ ఫోన్ల వినియోగంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. టీచర్లు తరగతి గదుల్లోకి తమ మొబైల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావకూడదని స్పష్టం చేసింది ఏపీ విద్యాశాఖ.

ఈ నిబంధనను అమలు చేయడానికి, తరగతి గదుల్లోకి ప్రవేశించే ముందు ఉపాధ్యాయులు తమ ఫోన్‌లను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు సరెండర్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాఠశాల విద్యా శాఖ కఠినంగా హెచ్చరించింది. ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్‌లలో వ్యక్తిగత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనేక ఫిర్యాదులు రావడంతో, ఈ సమస్యను పరిష్కరించడానికి విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

విద్యాసంస్థల్లో బోధన నాణ్యత పెంపునకు స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం హానికరం అని డిపార్ట్‌మెంట్ అంగీకరించింది. ఫలితంగా జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈఓలు) మరియు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్‌జేడీలు) కొత్తగా ఏర్పాటు చేసిన నిబంధనను శ్రద్ధగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను అధికారులు తెలిపారు. యునెస్కో 2003 లో ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.

ఇది కూడా చదవండి..

ఏపీలోని పొదుపు సంఘాల మహిళలకు శుభవార్త.. తగ్గించిన వడ్డీ రేట్లు..

ఆగస్టు మూడో తేదీన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన సమావేశంలో నిపుణుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. స్కూళ్లలో టెక్నాలజీ వినియోగం-గుడ్ గవర్నెన్స్‎కు సంబంధించి విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

బోధనా సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్‌లు ఉపయోగించకూడదని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. అంతేకాకుండా, హాజరు తీసుకున్న తర్వాత, తమ మొబైల్ ఫోన్‌లను సైలెంట్ మోడ్‌కి మార్చుకుని ప్రిన్సిపాల్ కార్యాలయంలో సరెండర్ చేయాల్సి ఉంటుంది. టీచర్లు ఉదయం తొమ్మిదిన్నరకు ముందు సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే సెల్ ఫోన్ వినియోగించాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి..

ఏపీలోని పొదుపు సంఘాల మహిళలకు శుభవార్త.. తగ్గించిన వడ్డీ రేట్లు..

Share your comments

Subscribe Magazine

More on News

More