ఒకవైపుకు ఇప్పటికే లక్ష రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించించి .. అయితే గతంలో లక్ష రూపాయలు తీసుకున్న రైతుల రుణాలు కాస్త వడ్డీ తో కలిపి రెండు లక్షలకు చేరింది .. ప్రభుత్వం ఇచ్చే ఈ రుణమాఫీ కేవలం వడ్డీ డబ్బులకే సరిపోతాయని రైతులు ఆందోళ వయక్తం చేస్తున్నారు ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది .. ఇప్పుడు వున్నా వడ్డీ లక్ష ఇంకో లక్ష పంట రుణాలు తీసుకోవాలని రైతులను సూచించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి.
తాము అధికారంలోకి రాగానే డిసెంబర్9 న రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందిస్తాని ప్రకటించారు. రైతులు రుణాలు ఎవ్వరు కట్టవద్దని మేము అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీ అందిస్తామని తెలిపారు.
తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని విస్మరించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతు వ్యతిరేకి అయిన కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 88 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను తన కుటుంబసభ్యులకు దోచి పెడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తామని, ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి రూ.5 లక్షల సాయం చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
Share your comments