నేటికాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. కొత్త తరహాలో మోసాలు చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. మొన్నటి వరకు పింక్ వాట్సాప్ అప్ అని రకరకాలుగా మోసాలు చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం అందుబాటులోకి తెస్తే, వాటిని కూడా వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ డాక్యూమెంట్లు పంపండి.. మీ ఖాతాల్లో ప్రభుత్వం నుండి డబ్బులు పొందుతారు అని నమ్మించి మోసం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆధార్ అప్డేట్ విషయం ప్రజల్లో కొనసాగుతుంది. ఇప్పుడు దీన్ని కూడా వాడుకుంటున్నారు మోసగాళ్లు. మన అందరికి ఆధార్ కార్డు అప్డేట్ చేసి పది సంవత్సరాలు దాటితే, వెంటనే అప్డేట్ చేయాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తెలిపింది. కొన్ని రోజుల క్రితం ఈ అప్డేట్ ప్రకటన రావడంతో.. ప్రజలు తమ ఆధార్ కార్డులని అప్డేట్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రజలు డైరెక్ట్ గా ఆధార్ సెంటర్లకు వెళ్లి ఆధార్ అప్డేట్ చేసుకుంటున్నారు. మరికొందరు ఆన్లైన్ విధానంలో అప్డేట్ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్స్తున్నారు. మాల్వేర్‌కు సంబంధించిన లింకులు షేర్ చేస్తూ.. ఈ లింక్ క్లిక్ చేసి, ఆధార్‌ని అప్డేట్ చేసుకోవచ్చంటూ తమ అస్త్రాల్ని సంధిస్తున్నారు. పొరపాటున ఆ లింక్స్ కనుక నొక్కినట్టయితే, మీ బ్యాంక్ వివరాలతో సహా మొత్తం సమాచారం అంత సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతాయి.
ఇది కూడదా చదవండి..
రైతు బంధు నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారులు.! ఎక్కడంటే?
ఈ సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే UIDAI అధికారులకు సమాచారం అందించారు. ఇ-మెయిల్ లేదా వాట్సాప్ వంటి ఛానెల్‌ల ద్వారా వారి ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసే ఉద్దేశ్యంతో వారి పత్రాలను పంచుకోవద్దని ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం మీ గుర్తింపు లేదా అడ్రస్ ఫ్రూఫ్‌లను ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా షేర్ చేయమని UIDAI ఎప్పుడూ అడగదు. కేవలం #myAadhaarPortal ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో మీ ఆధార్‌ను అప్డేట్ చేయండి అని తెలుపుతుంది. లేదంటే నేరుగా ఆధార్ కేంద్రాలకు వెళ్లి అప్డేట్ చేసుకోమని తెలుపుతుంది.
ఇది కూడదా చదవండి..
Share your comments