ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి, అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకం " ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన". ఈ పథకాన్ని దేశంలోని ప్రతి రైతుకు తనకున్న భూమితో సంబంధం లేకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయంలో అండగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తున్నారు. అయితే ఈ డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారిగా రూ. 2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ పథకం ద్వారా 8 విడుతల్లో అంటే ఒక రైతుకు 16 వేల రూపాయలు పంపిణీ చేశారు.తాజాగా 9వ విడత నగదును పంపిణి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 12.5 కోట్లు మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా20 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు పంపిణీ చేశారు.
అయితే ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరికీ వ్యవసాయ భూమి ఉన్నట్లయితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకంలో భాగంగా ఇద్దరికీ డబ్బులు వస్తాయా! లేదా వీరిలో ఎవరు అర్హులుగా పేర్కొంటారు. అన్న సందేహాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పథకం నియమం ప్రకారం కుటుంబంలో ఒక్కరు మాత్రమే పిఎం కిసాన్ పథకానికి అర్హులు. అందువల్ల భార్యాభర్తలిద్దరికీ వ్యవసాయ భూమి ఉన్నా ఒకరికి మాత్రమే పీఎం కిసాన్
డబ్బులు వస్తాయి.ఒకవేళ కుటుంబంలో ఇద్దరికీ
పిఎం కిసాన్ డబ్బులు వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి వసూలు చేసే అధికారం కూడా ఉంటుంది. కావున రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలి.
Share your comments