ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కృష్ణా జిల్లా మల్లవల్లిలో అభివృద్ధి చేసిన రెండు మెగా ఫుడ్ పార్కులు ఇప్పుడు 260 కోట్ల పెట్టుబడిని ఆకర్షించింది. అంతేకాకుండా సుమారుగా 6000 మందికి ఉపాధి కల్పిస్తుందని అని ఒక అంచనా .కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూ.112.94 కోట్లతో 57.95 ఎకరాల్లో మెగా వుడ్ పార్కును అభివృద్ధి చేయగా దాని పక్కెనే ఏపీ మౌలిక వసతుల కల్పన సంస్థ 42.55 ఎకరాల్లో మరో ఫుడ్ పార్కును అభివృద్ధి చేసింది.
మెగా ఫుడ్ పార్క్ లో రూ.86 కోట్లతో ఏర్పాటు చేసిన కోర్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)ని మామిడి సీజన్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఐఐసీ వెల్లడించింది. మామిడి, టమాటా, బొప్పాయి, జామ, అరటి వంటి వివిధ రకాల ఆహార ధాన్యాలను ప్రాసెస్ చేసి ప్యాక్ చేయడానికి సీపీసీకి ప్రత్యేకంగా రూపుదిద్దారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏప్రిల్ మొదటి వారం నుండి వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
మొదటి ఫుడ్ పార్క్
దేశంలోనే మొట్టమొదటి మెగా ఫుడ్ పార్క్ 2012 సంవత్సరం ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. చిత్తూరులో 'శ్రీని' మెగా ఫుడ్ పార్క్‌ను అప్పటి కేంద్ర వ్యవసాయ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శరద్ పవార్ ప్రారంభించారు. ఇది 147 ఎకరాల స్థలంలో నిర్మించబడింది.
ప్రయోజనాలు:
రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మంచి గిట్టుబాటు ధరని ఈ ఫుడ్ పార్కులు కల్పిస్తాయి.
రైతులు తమ ఉత్పత్తిని నేరుగా వీటికే అమ్ముకోవచ్చు ఎలాంటి బ్రోకర్ల అవసరం ఉండదు.
నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది.
వ్యవసాయ మరియు సంబంధిత రంగ ఉత్పత్తులు వృధా అవ్వకుండా ప్రాసెసింగ్ చేయవచ్చు.
వీటి ఉత్పత్తులని విదేశాలకి ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని గడించవచ్చు.
మరిన్ని చదవండి.
Share your comments