2020-21 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ సీసన్ యొక్క వరి పంట నికర ఆదాయంలో దేశంలోనే నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విషయానికి సంబంధించిన నివేదికను కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమశాఖ తెలియజేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంటె, వారి పంట నికర ఆదాయంలో హర్యానా మొదటి స్థానంలో నిలిచింది.
హర్యానా తర్వాత రెండవ స్థానంలో పంజాబ్, మూడో స్థానంలో కేరళ రాష్ట్రాల్లో వరి నికర ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2020-21 నివేదికల్లో కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమశాఖ ఎంపిక చేసిన రాష్ట్రాల్లో పరిణతయ్యే వ్యయాన్ని కుటుంబంలోని కూలీల ఖర్చును మద్దతు ధరను వారి పంటకు నికర ఆదాయం ఏ రాష్ట్రాల్లో ఎంత వచ్చింది అనేది తెలిపారు.
కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమశాఖ ఈ వరి యొక్క నికర ఆదాయాన్ని ఎలా లెక్కిస్తుంది అంటే, వారి పంటను పండించడానికి ఒక హెక్టార్ పొలంలో ఉపయోగించే ఇన్పుట్స్ యొక్క వ్యయం అనగా పంటకు వాడే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్రాలు మరియు సాగునీరుకు అయ్యే మొత్తం వ్యయాన్ని లెక్కిస్తుంది. తద్వారా ఒక హెక్టర్ పొలంలో పండే ధాన్యాన్ని పరిగణలోకి తీసుకుని, అప్పుడు ఉన్న మద్దతు ధరను బట్టి వివిధ రాష్ట్రాలకు సంబంధించి నికర ఆదాయాన్ని లెక్కిస్తుంది.
ఇది కూడా చదవండి..
రైతులను ఆందోళన కల్గిస్తున అకాలవర్షాలు .. మరో 2 రోజులు భారీ వర్షాలు !
ఇది ఇలా ఉంటె పరిగణలోకి తీసుకున్న అన్ని రాష్ట్రాల్లో పోలిస్తే మహారాష్ట్రకి మాత్రం తక్కువ నికర ఆదాయం వచ్చింది. మహారాష్ట్రలో ఆదాయం అనేది పెట్టున పెట్టుబడులు కన్నా తక్కువ వచ్చినట్లు నివేదికలో వెల్లడించారు. మహారాష్ట్రలో వరి పంట యొక్క నికర ఆదాయం అనేది రూ. 54,706 ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. కానీ ఇక్కడ వరి పంటను పండించడానికి కటుంబసభ్యుల కూలీలతో మొత్తం వ్యయం అనేది రూ.79.199 అయినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..
Share your comments