ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా ప్రభుత్వ ఉపాధ్యాయకులపై వేటు వేస్తుంది. వారిపై ప్రభుత్వం కొత్త అస్త్రాలను సంధిస్తోంది. గత కాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయకు లకు జీతాలను అందించడంలో ఆలస్యం చేయడం మరియు జీతాల కొరకు ఆందోళనలు చేస్తే అరెస్టులు, బైండోవర్ కేసులు పెట్టడం వంటివి చేసింది.
ఇటీవల ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయకులపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇప్పుడు ముఖఆధారిత హాజరు నమోదుపై దృష్టి పెట్టింది. ప్రతి ఒక్క అధ్యాపకుడు తప్పనిసరిగా నిర్దిష్ట సమయ వ్యవధిలో ఆన్‌లైన్‌లో హాజరు వేయాల్సిందేనని ఆదేశాలను ఇచ్చింది. ఎవరైనా కాస్త ఆలస్యంగానైనా వస్తే సెలవు పెట్టాల్సి వస్తుందని వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు.
దీంతో జిల్లా స్థాయి అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతోపాటు సోమవారం నుంచి ఈ కొత్త విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉదయం 9 గంటలలోపు హాజరైన ఉపాధ్యాయులకు మాత్రమే హాజరు లెక్కిస్తారని తెలిపారు. ఈ సమయం తరువాత వచ్చినట్లయితే క్యాజువల్ లీవ్ (సీఎల్)గా నమోదు చేయాల్సి ఉంటుంది. సీఎల్ సమర్పించకుంటే, షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరనున్నారు.
ఇది కూడా చదవండి..
అమరావతి రైతులకు శుభవార్త.. త్వరలోనే డబ్బులు జమ..
ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా రాష్ట్రమంతటా 1.80 లక్షల మంది ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఉపాధ్యాయులలో చాలామంది హాజరును 9 గంటలు దాటిన తర్వాత వేస్తున్నారని అధికారులకు కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి ఆదేశాలు వచ్చాయి. సెలవు నిబంధనల ప్రకారం, ఎవరైనా నెలలో మూడుసార్లు ఆలస్యంగా వస్తే, వారు హాఫ్ డే క్యాజువల్ లీవ్ తీసుకోవాలి. కాగా, ఇప్పుడు దీనిగురించి మాట్లాడకుండా, ఎవరైనా ఆలస్యంగా వస్తే సెలవు తీసుకోవాల్సి ఉంటుందని ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, అక్కడ సెల్ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో హాజరు నమోదుకు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవట్లేదు. దీని కారణంగా అక్కడి ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..
Share your comments