News

విద్యుత్ వినియోగదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెపింది. ఈ సంవత్సరం విద్యుత్ వినియోగదారులపై విద్యుత్ భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం విద్యుత్ టారిఫ్ పెంచబోవడం లేదని తెలిపారు.

ఈ వివరాల ప్రకారం ఈ సంవత్సరం విద్యుత్ వినియోగదారులపై విద్యుత్ భారం పడదని తెలిపారు. దీనితోపాటు రైతులకు వ్యవసాయం కొరకు ఉచిత విద్యుత్ అందించడంలో ఎటువంటి మార్పు లేదని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు సబ్సిడీ మరియు ఆక్వా రంగం, నాయీ బ్రాహ్మణలకు ఇస్తున్న విద్యుత్ రాయితీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. దీనితో రైతులకు ఉచిత విద్యుత్ పై ఉన్న ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

రైతులకు ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ మరియు నాయీ బ్రాహ్మణలకు రాయితీలకు మొత్తం అయ్యే ఖర్చు రూ. 10,131 కోట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటికీ అయ్యే రూ.10,131 కోట్ల ఖర్చును ప్రభుత్వమే భరించడానికి ముందుకు వచ్చిందని వెల్లడించారు.

ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీల వాళ్ళ మొత్తం మూడు డిస్కంలకు కలిపి రూ. 10,131 కోట్లు లోటు ఉందని తెలిపారు. విద్యుత్ ధరలను పెంచి ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఈ లోటును భరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, విద్యుత్ ధర పెంచి సామాన్యులపై భారం వేయలేదని ఛైర్మన్ నాగార్జున రెడ్డి చెప్పారు.

ఇది కూడా చదవండి..

కర్నూల్లో క్వింటా మిర్చి ధర రూ.48,786..

సాధారణ, పారిశ్రామిక వినియోగదారుల కేటగిరీలో అదనపు ఛార్జీలు ఉండవని ఆయన తెలిపారు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కంపెనీలకు, హెచ్టీ వినియోగదారులకు మాత్రం కిలోవాట్కు రూ.475 అదనపు డిమాండ్ ఛార్జ్ల ప్రతిపాదనను అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి జగన్ ఈ వేసవి కాలంలో ప్రజలకు విద్యుత్ కొరత ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. రైతులకు మోటార్లకు మీటర్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ఫిబ్రవరి నెలలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఏవైనా కారణాల వల్ల సోలార్ పంపుసెట్లు చెడిపోతే విద్యుత్ మీద ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి రైతులకు ఉచితంగా విద్యుత్ అందజేసేందుకు డిస్కంలు ముందుకొచ్చాయి అని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులపై విద్యుత్ భారం తప్పింది.

ఇది కూడా చదవండి..

కర్నూల్లో క్వింటా మిర్చి ధర రూ.48,786..

Share your comments

Subscribe Magazine

More on News

More