దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుండి బియ్యం వరకు అన్నిటి ధరలు భారీగా పెరికిపోయాయి. ప్రజలు ఈ నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలంటేనే వంద సార్లు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ధరలు అంతలా పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో టమోటా, మిర్చి, అల్లం మరియు బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. టమోటాలు ఐతే ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డ్స్ సృష్టించింది.
వ్యాపారాల అంచనా ప్రకారం ఆగస్టులోనూ టమాటా ధరలు తగ్గే అవకాశం లేదన్నారు. పైగా వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏమిటంటే, చాలా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు టమాటా తోటలతో పాటు, పలు కూరగాయల పంటలకు నష్టం జరిగింది. ఈ కారణంగా దిగుబడి తగ్గింది, కానీ డిమాండ్ తగ్గలేదు. దీనితో ధరలు బాగా పెరిగిపోయాయి. తాజాగా ఈ లిస్ట్ లో ఇప్పుడు చక్కెర కూడా చేరబోతోంది.
చక్కెర ధరలు సైతం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో ఈసారి నైరుతి రుతుపవనాల కారణంగా ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ, మహారాష్ట్ర , కర్ణాటక లో చెరుకు సాగు ఎక్కువగా చేసే ఈ ప్రాంతాల్లో తగినంతగా వర్షపాతం నమోదవ్వలేదు. అయితే గత జూన్ నెలలో కూడా వర్షపాతం తక్కువ నమోదయ్యింది.
ఇది కూడా చదవండి..
ఎన్నికలు వస్తున్నాయ్.! మీ ఫోన్లోనే డిజిటల్ ఓటర్ కార్డును సులువుగా డౌన్లోడ్ చేసుకోండిలా!
వర్షాలు తక్కువగా పడినందున చెరకు సాగు తీవ్రంగా ప్రభావితం అయ్యింది. రైతులు కూడా ఆశించిన అంత స్థాయిలో చెరకును సాగు చేయలేదు. పుణేలో కూడా డ్యామ్‌లలోని నీటి నిల్వలు 19 శాతం కూడా లేవని తెలిపారు. నిపుణులు ఈ ప్రభావం చెరకు సాగుపై పడుతుందని భావిస్తున్నారు. గత సంవత్సరం కంటే మరింతగా దిగుబడి తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అతి త్వరలో చక్కెర ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించవచ్చని అంచనా వేశారు. ఈ సంవత్సరం మొత్తానికి 3.4 శాతం చెరకు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది. దేశంలో వినిపిస్తున్న ఈ కొరత వార్తల కారణంగా సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చెక్కెర ధరలను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..
Share your comments