News

మహీంద్రా 605 నోవో తో రైతులకి ఆధునిక స్ఫూర్తిని ఇస్తున్న అభ్యుదయ రైతు అంకిత్

KJ Staff
KJ Staff

లాభాలతో కూడిన సమగ్ర వ్యవసాయం కేవలం రైతు కృషి, కష్టంతో మాత్రమే సాధ్యం కాదు దానికి ఆధునిక సాంకేతికత మరియు తెలివి  కూడా కావాలి. 

ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన అంకిత్ కుమార్ కథ ఎంతో మంది రైతులకి ఒక స్ఫూర్తి. ఆధునిక  సాంకేతికతను ఉపయోగించి పంట ఉత్పత్తిని , రాబడిని ఎలా పెంచుకోవచ్చో చూపించి రైతుల కష్టాలకి ఒక సమాధానం అయ్యాడు. 

ఆధునిక పరికరాలు, సాంకేతికతలని వాడి అతి తక్కువ పరిశ్రమతో నాణ్యమైన పంటలని సాధించవచ్చు అని నమ్మే అభ్యుదయ రైతు అంకిత్. సాంప్రదాయ ట్రాక్టర్లతో పని అంటే అధిక శ్రమ, అధిక సమయం అని గుర్తించి, అతను మహీంద్రా 605 నోవో ట్రాక్టర్ కి మారాడు.

మహీంద్రా 605 నోవో: ఆధునిక వ్యవసాయంలో రైతు నేస్తం. మహీంద్రా 605 నోవో వాడుతున్నప్పడి నుండి అంకిత్ జీవితం మారిపోయింది. అతడు అంతముందు ఎన్నడూ ఇంత సులువుగా వ్యవసాయం చెయ్యలేదు అంట. ఈ ట్రాక్టర్ కి మూడు విధానాలు (మోడ్స్) ఉన్నాయి  ఉన్నాయి. డీజిల్ సేవర్, సాధారణ (నార్మల్) అలానే శక్తి (పవర్ )  ఇలా అవసరానికి తగ్గట్టు వేరు వేరు విధానాలతో పని అత్యంత సులువుగా, అతి తక్కువ ఇంధనం వాడి  చేయగలిగాడు.  

డీజిల్ సేవర్ మోడ్ : ఈ మోడ్ ని వాడి అత్యధికంగా ఇంధన సామర్ధ్యాన్ని పెంపొందించవచ్చు . దీన్ని బండి లోడ్ లేకుండా పొలాల్లోకి వెళ్ళేటప్పుడు వాడాలి. 

సాధారణ(జనరల్) మోడ్ : పంట పొలాల దినసరి చర్యలకి అంటే పొలం దున్నటం వంటి వాటికి ఈ విధానాన్ని వాడాలి.  

శక్తీ  (పవర్ )మోడ్: తడి మట్టి మొయ్యటం, ఆదునిక బరువు లాగటం లాంటి పనులు ఆగకుండా, సమస్య లేకుండా  చెయ్యడానికి ఈ విధానాన్ని వాడాలి. 

ఆధునిక సాంకేతికతతోనే సమస్య లేని వ్యవసాయం : 

ఈ ట్రాక్టర్ కి ఉన్న ఇంకో గొప్పతనం దీని CRDI ఇంజిను. ఇది చాలా శక్తివంతమైంది అయినా ఇంధన సమగ్రత కూడా కలిగినది.   

“దీని పనితీరుకు తిరుగులేదు, ఎలాంటి పరిస్థితి లో అయినా పొలంలో దీని శక్తి మాత్రం తగ్గదు” అని అంకిత్ అంటాడు.   

అంతేకాదు , అతి తక్కువ శబ్దంతో నడిచే ఈ బండి కి,  డిజిటల్ డాష్ బోర్డు ఇంకో ఆకర్షణ. ఇంతకు ముందు ట్రాక్టర్ బోనెట్ తెరిస్తేనే కానీ ఇంజిను పరిస్థితి తెలిసేది కాదు . అయితే ఇప్పుడు కేవలం డిజిటల్ డాష్ బోర్డు ద్వారా మొత్తం ఇంజిన్ వివరాలు తెలుసుకోవచ్చు .

“ఇప్పుడు నేను హాయిగా ఫోన్లో మాట్లాడుతూ పాటలు వింటూ కూడా ట్రాక్టర్ నడపచ్చు. మహీంద్రా 605 నోవో ఆధునిక సాంకేతిక రాక ముందు ఇదంతా లేదు . మహీంద్రా 605 నోవో దీన్ని సాధ్యం చేసింది”, అని  అంకిత్ పేర్కొన్నాడు.

దీర్ఘ కాలిక పనితీరు, ఇక ఆగేదే లేదు: 

వ్యవసాయంలో దీర్ఘకాలిక పనితీరు ఎంతో ముఖ్యమైంది. మహీంద్రా 605 నోవో ఆటో ఇంజిన్ అధిక వేడి ఉద్ఘాతం తగ్గించి అంకిత్ జీవితాన్ని సుగమం చేసింది. ఇకపై ఎన్ని గంటలైనా అంతరాయం లేకుండా అంకిత్ పనిచెయ్యగలడు .   

మహీంద్రా 605 నోవో శక్తీ వంతమైన లైటింగ్, ఎంత రాత్రి అయినా పని జరిగేటట్టు చూస్తుంది.  “వేరే ట్రాక్టర్ల తో పోలిస్తే ఇది మెరుగైన వెలుగు ఇస్తుంది, దానివల్ల, రాత్రి పూట వ్యవసాయం చాలా సులువు అయ్యింది ”, అంకిత్. 

మహీంద్రా విజయం:  

మహీంద్రా 605 నోవో కేవలం పంట పనుల్లో సాయం మాత్రమే కాదు, పంట దిగుబడి అలానే రాబడిని కూడా గణ నీయంగా పెంచింది.  ఇప్పుడు అతడు వ్యవసాయ పనుల్ని తక్కువ సమయంలో చేసుకొని, పంట పొలాల పోషణ మీద ఎక్కువ దృష్టి పెట్టగలుగుతున్నాడు.  

అంకిత్ అత్యఆధునిక పరికరాలు వాడి అధిక దిగుబడి లాభాలను గడించి తన తోటి రైతులకి ఒక స్ఫూర్తి గా నిలిచాడు. 

“మహీంద్రా తో కష్టం అవుతుంది సులువు , వ్యవసాయ సమస్యలకి ఇంకా సెలవు” 

మహీంద్రా 605 నోవో కేవలం ఒక ట్రాక్టర్ కాదు; ఇది రైతుల కలల్ని సాకారం చేసే ఒక నమ్మకమైన భాగస్వామి. అంకిత భావం మరియు సాంకేతిక తో పంట ఉత్పత్తి, రాబడి  ఎలా పెంచుకోవడానికి అంకిత్ కథే నిదర్శనం. 

Share your comments

Subscribe Magazine

More on News

More