
ఒక ఆధునిక వ్యవసాయికవిప్లవం ఆంద్రప్రదేశ్ లో పురుడు పోసుకుంటోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పొలాల్లో డ్రోన్ల హోరు పోటెత్తనుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి రైతులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 570 రైతు గ్రూపులకు, అలానే ఎఫ్పిఒ లకు 80 శాతం సబ్సిడీతో డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. భారీ ఆకారంలో ఉండే ఈ డ్రోన్లని అతి తక్కువ ధరకే రైతు అన్నలకి అందజేయనున్నారు. సాధారణంగా 10 లక్షల విలువ చేసే ఒక్కో డ్రోను, రైతులకి కేవలం 2 లక్షల రూపాయిలకే లభించనుంది. అంటే రైతులకు ఒక్కో డ్రోన్ ద్వారా రూ.8లక్షలు ఆదా అవుతుంది.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంగా, వ్యవసాయానికి మరింత టెక్నాలజీని జోడించి, కూలీల కొరత తీర్చేందుకు డ్రోన్‌ల ఉపయోగం ఎంతగానో దోహదపడుతుందని అన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తెచ్చింది.
2024-2025 ఆర్ధిక సంవత్సరానికి గాను చంద్రబాబు నాయుడి కూటమి ప్రభుత్వం అప్పటికే 70 కోట్ల రూపాయలతో 875 డ్రోన్ల పంపిణీకి కార్యాచరణ మొదలు పెట్టింది. అయితే ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ఇంకో 1000 డ్రోన్లని పంపిణీ చేయనుంది. దీనికోసం ఇంకో 80 కోట్ల రుపాయిలు ఖర్చు కానున్నాయి.
ఈ పథకం కోసం ఏపీ వ్యవసాయ శాఖ మండలానికి కనీసం ఒక్క రైతు గ్రూప్‌ని ఎంపిక చేస్తుంది. అలానే ఈ పథకం అమలు చెయ్యడం కోసం ప్రస్తుతం ఒక టెక్నికల్ కమిటీ ని వేసి, దాని ద్వారా డ్రోన్ కంపెనీలని ఎంచుకోనున్నారు. అలా తీసుకున్న డ్రోన్‌తోపాటూ ఒక ఎలక్ట్రిక్ వాహనం కూడా లభిస్తుంది. అందులోనే డ్రోన్‌ని తీసుకొని వెళ్లవలిసి ఉంటుంది. పొలం దగ్గరకు దాన్ని మోసుకొని వెళ్ళాక, దాని విడి భాగాలను కలుపుతారు. ఇది మొత్తం ఐదు నిమిషాలలో అవుతుంది. దీని తర్వాతా ఇక పిచికారీ చెయ్యడమే.
ఈ బడ్జెట్ లో భాగంగానే అర్హత కలిగిన ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం కింద 20 వేల రూపాయలు అందించా బోతున్నారు. పీఎం కిసాన్ పధకం తో కలుపుకొని పూర్తి 20 వేలు పెట్టుబడి సాయం గా రైతులకి అందనున్నది. అంతే కాకుండా నిరుపేద రైతుల కి డ్రిప్ లు, స్ప్రింక్లర్ లు, యాంత్రీకరణ కూడా అందిచడం జరుగుతుంది. ఈ పథకం మే నెల నుండి అమలుకానుండి.
అంతే కాకుండా సీసీఆర్ కార్డులు లేకపోయినా కూడా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందనుంది. ఇందుకోసం ఈ-పోర్టల్‌లో నమోదు చేసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం పొందవచ్చు. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.9,400 కోట్లు కేటాయించారు.
అలానే మార్చ్ 12 నుండి ప్రభుత్వం అందజేస్తున్న వ్యవసాయ సాగు పరికరాల కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ పరికరాల కోసం వ్యవసాయదారులు, తమ సమీప రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలి. వ్యవసాయ సహాయకుడి సహకారంతో రైతులు వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలి. మండల వ్యవసాయాధికారి అంటే అగ్రికల్చరల్ ఆఫీసర్ నుండి నిర్ధారణ పొంది, ఆ తరువాత వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు దగ్గరకి వెళ్ళాలి. అక్కడ కూడా అప్రూవ్ పొందిన వెంటనే, రైతులకు వ్యవసాయ సాగు పరికరాలు, మరియు యంత్రాలు మంజూరు చేస్తారు. ఈ సేవలని మార్చ్ 26వ తారీఖు లోపల రైతులు ఉపయోగించుకోగలరు.
ఈ సంవత్సరానికి గాను జిల్లాకు 1,697 యూనిట్లని చంద్రబాబు కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పథకాన్ని ఉపయోగించుకోవడం కోసం వ్యవసాయదారులు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఈ పరికరాలను రైతులు తమ సొంత అవసరాలకు వాడుకోవడంతోపాటు తోటి రైతులకు కూడా తగినంత ధరతో పంచుకునే అందించే అవకాశం వుంది.
Share your comments