ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం లో అప్పటికే ఉన్న 13 జిల్లాలను .. లోక్‌సభ నియోజకవర్గాల ఆధారంగా మొత్తం 26 జిల్లాలుగా విభజించింది . అయితే ఇప్పుడు మరోసారి జిల్లాలను విభజిస్తూ... ఉప జిల్లాల ఏర్పాటుకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని జిల్లాల్లో కొత్త ఉప-జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
అనకాపల్లి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పుగోదావరి మొదలగు జిల్లాల్లో కొత్త ఉప జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఈ ఉప జిల్లాల్లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ప్రారంభించబడతాయి అని ప్రకటించింది ప్రభుత్వం.
అమరావతి లో భూ సర్వేలు పూర్తిచేసిన తర్వాత పరిపాలన పనులు, పౌరసేవలు, రిజిస్ట్రేషన్‌లను వేగవంతం చేసేందుకు కొన్ని జిల్లాల్లో కొత్త సబ్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
అనకాపల్లి, చిత్తూరు , కృష్ణా, పార్వతీపురం, నెల్లూరు , శ్రీకాకుళం, తిరుపతి , విజయనగరం, కడప , కోనసీమ, ఏలూరు, కర్నూలు , తూర్పుగోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం.కొత్తగా ఏర్పడిన ఉప జిల్లాలలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటుచేస్తారు. తద్వారా భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తిచేసేందుకు వీలవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని కధనాలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి
Share your comments