మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తన కిసాన్ న్యాయ్ యాత్రను ప్రారంభించనున్న క్రమంలో, అక్కడి బీజేపీ ప్రభుత్వం సోయాబీన్ కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 4,800కు పెంచే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం నుంచి నిన్న ఆమోదం తెలిపింది, అదేవిదంగా ప్రతి పదనను కేంద్రానికి పంపింది.
అంతకుముందు రోజు, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియా తో మాట్లాడుతూ, కేంద్రం ఇప్పటికే మహారాష్ట్రతో సహా మూడు రాష్ట్రాల ప్రతిపాదనలను ఆమోదించిందని మరియు మధ్యప్రదేశ్ ప్రతిపాదనను కూడా పరిగణన లోకి తీసుకుంటుందని తెలిపారు.
క్యాబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ విలేకరులతో మాట్లాడుతూ, సోయాబీన్‌కు ఎంఎస్పీని క్వింటాల్‌కు రూ.4,800కు పెంచాలని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రతిపాదించగా, ఆ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో సోయాబీన్ దిగుబడి బాగా ఉందని, రైతులకు సరైన ధర లభించడం లేదని, ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.4వేలు పలుకుతున్నాయన్నారు.
ఈ ప్రతిపాదనను ఆమోదం కోసం కేంద్రానికి పంపనున్నట్లు మంత్రి తెలిపారు.
సోమవారం రోజు విలేకరులతో మాట్లాడిన మంత్రి చౌహాన్, సోయాబీన్‌ను ఎంఎస్‌పికి కొనుగోలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.
మహారాష్ట్ర, కర్నాటక సహా మూడు రాష్ట్రాలు సోయాబీన్‌ను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాయని, వాటికి కేంద్రం మద్దతు ధర పథకం (పీఎస్ఎస్) కింద అనుమతులు మంజూరు చేశామన్నారు.
రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడమే నరేంద్రమోదీ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
Share your comments