News

రూ . 2000 మార్చేటప్పుడు జాగ్రత్త .. ఎవరైనా మోసంచేస్తే ..ఇలా చేయండి !

Srikanth B
Srikanth B
రూ . 2000 మార్చేటప్పుడు జాగ్రత్త .. ఎవరైనా మోసంచేస్తే ..ఇలా చేయండి !
రూ . 2000 మార్చేటప్పుడు జాగ్రత్త .. ఎవరైనా మోసంచేస్తే ..ఇలా చేయండి !

రూ . 2000 నోట్లను చలామణినుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం ప్రజలలో చాల సందేహాలు నెలకొన్నాయి , దీనినే అదనుగా భావించిన కేటుగాళ్లు ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారు ప్రజలను లేనిపోని అపోహలు కల్గించి వారిని మోసం చేసి డబ్బులను దోచుకుంటున్నారు అయితే అమాయక ప్రజలను లక్ష్యం గ చేసుకొని డబ్బులు దోచుకునే కేటుగాళ్ల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొలిసు అధికారులు సూచిస్తున్నారు .

తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ప్రజలకు సూచనలు జారీ చేసింది ఎటువంటి కమిషన్ లేకుండానే బ్యాంకుల్లో నేరుగా మార్చుకోవచ్చన్నారు. అలా ఎవరైనా మోసాలకు పాల్పడుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. నోట్ల మార్పిడికి బ్యాంకులకే వెళ్లాలని, కొత్తవారిని నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సూచించింది.

నోట్ల మార్పిడికి సంబందించిన 5 కీలక విషయాలు

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంటూ నోటిఫికేషన్ జారీ చేసింది ఇప్పటివరకు చలామణిలో ఉన్న 2000 రూపాయల నోటు చలామణిని నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది అంటే 2000 నోట్లను కొత్తగా ముద్రించదు మరియు ఇప్పటికీ చలామణిలో ఉన్న నోట్లను ఉన్న నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల ద్వారా మార్చుకోవాలని అదేవిధంగా రేపటి నుంచి బ్యాంకు ద్వారా డబ్బులు విత్ డ్రా చేసుకునే వారికీ 2000 రూపాయల నోటును ఇవ్వరాదని నోటీసులు జారీ చేసింది .


ఇది కూడా చదవండి .

సెప్టెంబరు 30 తర్వాత రూ.2,000 నోట్లు చెల్లవ ?

5 కీలక అంశాలు :

1 మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకు ద్వారా అయినా 2000 నోటును మార్చుకోవచ్చు .
2 సెప్టెంబర్ 30 లోగ 2000 నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవాలి .
3 రేపటి నుంచి బ్యాంకులలో 2000 నోట్లు ఇవ్వరాదు .
4 మే 19 నుంచి 2000 నోటు చలామణిలోకి రాదు .
5 2018-2019 లోనే 2000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది .

ఇది కూడా చదవండి .

సెప్టెంబరు 30 తర్వాత రూ.2,000 నోట్లు చెల్లవ ?

Related Topics

RBI 2000 rupee notes

Share your comments

Subscribe Magazine

More on News

More