News

తెలంగాణ వ్యవసాయ భూముల విలువల్లో భారీగా మార్పులు!

KJ Staff
KJ Staff

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూముల విలువలు, రిజిస్ట్రేషన్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచింది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం భూమి విలువలతో పాటు, పలు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడంతో ఈ భారం సామాన్యులపై ఎక్కువగా పడింది. ప్రస్తుతమున్న వ్యవసాయేతర భూముల విలువలు ఇప్పటికన్నా యాభై శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ తెలియజేసింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువలు పెరగడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పెంచనున్నారు. దాదాపు 20 రకాల రిజిస్ట్రేషన్ సర్వీసులపై తెలంగాణ ప్రభుత్వం అధిక చార్జీలు వసూలు చేయనుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, ఆస్తి విలువ గరిష్టంగా 50 శాతం పెరగగా ప్రాంతీయ ఆయా ప్రాంతాలను బట్టి భూముల విలువ 30 శాతం 40 శాతం పెరగనున్నాయి. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ భూముల విలువలను పెంచుతూ... వాటిని పెంచడానికి గల కారణాలను కూడా ఉత్తర్వులలో తెలిపింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వం రెట్టింపు చేసిన భూమి విలువలు స్టాంపులు రిజిస్ట్రేషన్ తదితర విలువ పెంపు ప్రక్రియలను రిజిస్ట్రేషన్ శాఖ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్ మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి తెలంగాణ భూముల విలువను సవరించలేదు. ఈ కాలంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం పెరిగింది. అదే విధంగా కొత్త ఆయకట్టులు, ప్రాజెక్టు అభివృద్ధి చెందడంతో సాగునీటి వసతి కూడా పెరిగింది. ఈ క్రమంలోనే భూములకు వారి విలువలు పెరిగాయని తెలియజేశారు.

Share your comments

Subscribe Magazine

More on News

More