ఈ రోజుల్లో సాంకేతికతతో పని లేకుండా ఏ వృత్తి, ఉద్యోగాలు లేవు. వ్యవసాయానికి మట్టి ఉంటె చాలు టెక్నాలజీ తో మనకేం పని అని అనుకుంటే రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం అన్నిటికన్నా వెనకపడిపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి మన రైతులు కూడా , తాజా పోకడలు మరియు సాంకేతికతలు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండటం చాలా అవసరం. భారతీయ రైతులు అధిక దిగుబడిని పొందడానికి 2023లో బాగా ప్రాచుర్యం పొందుతున్న కొన్ని అగ్ర వ్యవసాయ పోకడలు ఇప్పుడు చూద్దాం.
1. ఆర్గానిక్ వ్యవసాయం: ఇప్పుడు దేశం లో ఎక్కడ చుసిన వినిపించే మాట ఇది. ఆర్గానిక్ పంటలకు , ఆహారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . ఈ పెరుగుతున్న ధోరణికి అనుగుణంగా , రైతులు ఎక్కువగా సేంద్రీయ వ్యవసాయం, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించే ఇతర పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా దీర్ఘకాలంలో అధిక దిగుబడులు పొందవచ్చు.
2. వర్టికల్ (నిలువు) వ్యవసాయం: ఈ వ్యవసాయ పద్దతిలో విజయం సాధించి లక్షల్లో సంపాదింస్తున్న రైతులు కోకొల్లలు. వర్టికల్ ఫార్మింగ్ అనేది కృత్రిమ లైటింగ్ , నియంత్రిత ఉష్ణోగ్రత మరియు తేమను ఉపయోగించి నిలువుగా పేర్చబడిన పొరలలో పంటలను పండించే పద్ధతి. ఈ సాంకేతికత ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉపయోగపడుతుంది, ఇక్కడ భూమి తక్కువగా ఉండడం వళ్ళ, ప్రతి చదరపు అడుగు భూమిని,చక్కగా వినియోగిస్తూ, అధిక దిగుబడిని పొందవచ్చు.
3. ప్రెసిషన్ వ్యవసాయం: పంటలు మరియు మట్టిని మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రెసిషన్ వ్యవసాయం అంటారు. సెన్సార్లు, డ్రోన్లు వంటి సాధనాలను ఉపయోగించడం ద్వారా, రైతులు పంట పెరుగుదల, నేలలో తేమ శాతం, చీడ పీడల దాడి , వంటి అంశాలను సరైన సమయంలోనే గుర్తించి నష్టం జరగక ముందే తగిన చర్యలు తీస్కోవచ్చు .దీనివల్ల , తక్కువ ఖర్చుతో, పంట నష్టాన్ని నివారిస్తూ అధిక దిగుబడులు సాదించవచ్చు.
ఇది కూడా చదవండి
వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం..దీనివల్ల ప్రయోజనాలు మరియు నష్టాలు
4. పంటల వైవిధ్యం: ఒక భూమిలో పదే పదే ఒకే పంట వేయడం వళ్ళ క్రమేణా నెలలో సారం తగ్గిపోయి దిగుబడులు కూడా తగ్గిపోతాయి.
కాబట్టి రైతులు పంట నష్టాన్ని తగ్గించుకొని , దిగుబడిని పెంచుకోవడానికి బహుళ పంటల సాగు పాటించాలి . తమ పంటలను వైవిధ్యపరచడం ద్వారా, మట్టిలో మల్లి పోషకాలు సమకూర్చడంతో పాటు, రైతులు వివిధ మార్కెట్ పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.
5. డిజిటల్ వ్యవసాయం: డిజిటల్ వ్యవసాయం అనేది పంట కోత కోసి , మార్కెట్ లో అమ్మే వరకు జరిగే వివిధ వ్యవసాయ లావాదేవీలను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించడం. ఇది రైతులు తమ పంట అమ్మేటపుడు , కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది, ఇది అధిక దిగుబడి మరియు ఎక్కువ లాభదాయకతకు దారి తీస్తుంది.
ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా, రైతులు తమ వ్యవసాయ కార్యాలను సులభతరం చేసుకొని, మారుతున్న వాతావరణం మరియు పెరుగుతున్న జనాభా యొక్క సవాళ్లను ఎదుర్కోవచ్చు మరియు రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందవచ్చు.
ఇది కూడా చదవండి
Share your comments