News

Agri Tech Madhya Pradesh 2024:మూడు రోజులు జరగనున్న కిసాన్ మేళ "మిల్లియనీర్ ఫార్మర్స్ ని" పురస్కరించనున్న కృషి జాగరణ్

KJ Staff
KJ Staff

మధ్య ప్రదేశ్ లో రైతుల యొక్క స్థాననం చాల విశిష్టమైనది. ఇప్పటికి 80% కంటే ఎక్కువ ప్రజలు వ్యవసాయాన్ని, పశు పాలనను తమ జీవన ఉపాధిగా కొనసాగిస్తున్నారు. వ్యవసాయానికి ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ రాష్ట్రంలో వారి ప్రభుత్వం కర్షకుల శ్రమను గుర్తించి వారిని సన్మానిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఎల్లపుడు రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుంది. దీనిలో భాగంగానే మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మరొక్క సారి కృషి విజ్ఞాన్ మేళ తో ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యం రైతులకు కొత్త ఆవిష్కరణల మీద అవగాహన కలిపించడం వారిని జాగృతం చెయ్యడం. ఈ కార్యక్రమం మధ్య ప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ఏక్ కె ఎస్ విశ్వవిద్యాలయం లో ఈ రోజు అంటే 20 ఫిబ్రవరి మంగళవారం మొదలై 22 గురువారం వరకు జరగనుంది. ఈ మూడు రోజుల మేళా రైతులు ప్రకృతి వ్యవసాయం గురించి, సుగంధద్రవ్యాలు మొక్కల, ఒసాదాల మొక్కల గురించి, వాటిని పండించడం అలాగే వాటి ఉపయోగాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

రైతులను సన్మానించిన కృషి జాగరణ్:

భారత దేశంలో ప్రముఖ మీడియా హౌస్ అయినటివంటి కృషి జాగరణ్ , ఈ కృషి మేళ ను పురస్కరించుకుని కృషి జాగరణ్ మిలినీర్ ఫార్మర్ అఫ్ ఇండియ (MFOI ) గురించి తెలియచేసింది. MFoI అంటే ఏమిటి? దీనియొక్క ప్రముఖ్యతను రైతులకు తెలియచేసింది. అంతే కాకుండా వ్యసాయం లో విశిష్టమైన కృషి చేసిన రైతులను పురస్కరించింది

Related Topics

Kisnamela Krishi Jagran

Share your comments

Subscribe Magazine

More on News

More