ప్రస్తుతం ప్రపంచం అంతటా కోవిడ్ తగ్గుతున్నప్పటికీ కొత్త వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. కొత్తగా అమెరికాలో కోవిడ్ యొక్క కొత్త వేరియెంట్ ని గుర్తించారు. ఈ వేరియంట్‌ను బీఏ.2.86గా పేర్కొన్నారు. దీనిని అమెరికాతో పాటు డెన్మార్క్, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు. దీన్ని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమైంది.
ఈ వేరియెంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ఇందులో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటున్నందున.. ప్రస్తుతం దీన్ని 'వేరియంట్ అండర్ మానీటరింగ్'గా పేర్కొన్నామని తెలిపింది. ప్రస్తుతం మూడు వేరియంట్ ఆఫ్ ఇంటెరెస్ట్‌లతోపాటు ఏడు వేరియంట్స్ అండర్ మానిటరింగ్‌లను ట్రాకింగ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రపంచం మొత్తానికి పెను ప్రమాదం పొంచి ఉన్న ఆసన్న ప్రమాదం. గుజరాత్‌లో జరిగిన G20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో తన ప్రారంభ ప్రసంగం సందర్భంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ కోవిడ్-19 మహమ్మారి ద్వారా ప్రపంచ ముప్పును నొక్కి చెప్పారు.
ఇది కూడా చదవండి..
మహిళలకు శుభవార్త.. వారి ఖాతాల్లో ఈ నెల 22న రూ.15,000 జమ చేయనున్న ప్రభత్వం..
కొవిడ్-19 మనందరికీ నేర్పిన ముఖ్యమైన పాఠం ఏంటంటే.. ఆరోగ్య ముప్పు ఉంటే ప్రతీదీ ముప్పేనని. మహహ్మారి నుంచి బాధాకరమైన పాఠాలను ప్రపంచదేశాలు నేర్చుకుంటున్నాయి. ప్రస్తుతం కొవిడ్-19 అంతర్జాతీయ ఆరోగ్య అత్యయికస్థితి కానప్పటికీ దీని నుంచి ఇంకా ముప్పు పొంచి ఉంది. కొత్తగా వెలుగుచూసిన వేరియంట్‌లో ఎన్నో పరివర్తనాలు ఉన్నాయి.
దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇటువంటి కొత్త వేరియంట్లు ఎత్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో 'మహమ్మారి ఒప్పందం' ఖరారు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తున్నా. తద్వారా వచ్చే ఏడాది జరిగే ప్రపంచ ఆరోగ్య సమావేశంలో దానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది' అని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి..
Share your comments