సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వంద శాతం రాయితీతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందించనుంది ప్రభుత్వం.
ఈ కార్యక్రమం ఆగస్టులో ప్రారంభించబడుతుంది. కార్యక్రమం యొక్క మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే అందించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ దశలవారీగా నిర్వహించబడుతుంది మరియు కార్యక్రమ నిర్వహణ విధానాలు ఇంకా ఖరారు చేయబడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం ప్రతి సంవత్సరం రాష్ట్రంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారిని 4 లక్షల మందిని ఎంపికచేసి వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారులకు సాయం అందించాలని మార్గదర్శకాల్లోపేర్కొంది.
'గృహలక్ష్మి' చొరవను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ఇటీవల కార్యాచరణ విధానాలను రూపొందించాలని ఆదేశించింది, అధికారులు ఈ పనిలో నమగ్నమై ఉన్నారు. ఏ ప్రభుత్వ పథకంలోనూ లబ్ధి పొందని వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి..
అప్డేట్: బీసీలకు లక్ష సాయం.. మొదటి విడత ఎప్పుడంటే?
షెడ్యూల్డ్ కులాల వ్యక్తులకు 20 శాతం, షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) 10 శాతం, వెనుకబడిన తరగతి (బీసీ)లకు 50 శాతం ప్రయోజనాలను కేటాయించాలని స్పష్టంగా పేర్కొంది. మిగిలిన 20 శాతం ఆర్థికంగా వెనుకబడిన వారికి కేటాయిస్తారు. మున్సిపల్, పంచాయితీ రాజ్, రోడ్లు-భవనాలు వంటి వివిధ శాఖల అధికారులు ప్రస్తుత నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యాచరణ విధానాలను రూపొందించడంలో సహకరిస్తారు.
ఆగస్టు చివరివారం నుంచి లబ్ధిదారుల దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు మంత్రిస్థాయిలో మథనం చేసి ముసాయిదా విధానాలను సీఎం కేసీఆర్‌కు ఉన్నతాధికారులు అందజేస్తారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేశాక తుది ఉత్తర్వులు వెలువడతాయని సమాచారం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 వేల మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం అందచేయనున్నందున.. మిగిలిన దరఖాస్తుదారులను ప్రాధాన్యక్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యం ఇవనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు చేసుకునేందుకు తుది గడువును కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక ప్రకటించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..
Share your comments