ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో, రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద 23.50 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ పథకం రైతులకు బీమా కవరేజీని అందించడం మరియు ప్రమాదాలు నుండి వారి పంటలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గత సంవత్సరంతో పోలిస్తీ ఈ సంవత్సరం ఈ పథకానికి రెట్టింపు సంఖ్యలో రైతులు నమోదు చేసుకున్నారు. 2016 నుండి మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫసల్ బీమా పథకం అమలులో ఉంది. దీని కింద ఒక్క రైతు బీమా చేయించుకున్న మొత్తంలో కొంత శాతం ముందుగా చెల్లించాలి.
ఖరీఫ్ సీజన్లో ఆహార ధాన్యాలు (గోధుమ, వరి, పప్పు ధాన్యాలు, నూనెగింజలు)కు సంబంధించి బీమా చేయించుకున్న మొత్తంలో 2 శాతాన్ని కర్షకులు చెల్లించాల్సి ఉంటుంది. ఇతర వాణిజ్య పంటల కోసం బీమా మొత్తంలో 5 శాతం చెల్లించాలి. అదే రబీ సీజన్ విషయానికొస్తే ఆహార ధాన్యాలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
పంటల బీమా కోసం 2 ఎకరాల వరకు భూమి నమోదు చేసుకున్న రైతులకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా మినహాయింపు ఉంటుందని, సహకార శాఖ ఖర్చులను భరిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం సన్న, చిన్నకారు రైతులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి..
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. వారికి ప్రతి నెల ఒక్కొక్కరికి రూ.5వేలు..
ఈ ఏడాది ఫసల్ బీమా కోసం అన్నదాతల రిజిస్ట్రేషన్ సంఖ్య పెరిగినప్పటికీ వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర గణాంకాలతో పోలిస్తే ఇదంత సంతృప్తికరంగా లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఫసల్ బీమా యోజన పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య 50:50 నిష్పత్తితో పంటల బీమాకు రాయితీలు కల్పిస్తున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ గణాంకాలతో పోల్చినప్పుడు పంటల బీమా కోసం నమోదు చేసుకున్న రైతుల సంఖ్య ప్రస్తుత పెరుగుదల అంచనాలకు తగ్గట్టుగా ఉంది. రాష్ట్రంలో సుమారు 50 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉన్నప్పటికీ, కేవలం 10 లక్షల మంది వ్యక్తులు మాత్రమే అన్నదాతలుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. సాగు భూమి విషయానికొస్తే, 45 లక్షల హెక్టార్లు వ్యవసాయానికి ఉపయోగించబడుతుండగా, 10 లక్షల హెక్టార్లకు మాత్రమే బీమా వర్తిస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments