వృద్ధాప్యంలో రైతులకు ఎటువంటి ఆసరా లేని పక్షంలో వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వృద్ధాప్యంలో రైతులకు ప్రతి నెల పెన్షన్ అందజేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వృద్ధ రైతుల కోసం "ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన"పథకాన్ని తీసుకువచ్చింది. ఎవరైతే ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ రైతులకు ప్రతి నెల 3000 రూపాయల పెన్షన్ అందుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా
21,40,650 రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ పథకానికి సుమారుగా 9,048 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా ఆంధ్రప్రదేశ్లో 31,861మంది రైతులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. రెండు హెక్టార్ల పొలం ఉన్న రైతులు ఎవరైనా కూడా ఈ పథకంలో చేరడానికి అర్హులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పథకంలో చేరే రైతులు కొన్ని ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో రైతులు చేరేనాటికి వారి వయసును బట్టి రూ.55 నుంచి రూ 200 చెల్లించాల్సి ఉంటుంది. ఒక రైతు 18 సంవత్సరాల వయసులో ఈ పథకంలోకి చేరితే రూ.55 ప్రీమియం చెల్లించాలి. అదేవిధంగా 30 ఏళ్లలో చేరితే రూ.110, 40 ఏళ్ళ వయసులో చేరితే రూ.200 ప్రతినెల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధంగా రైతులు ఎంత మొత్తంలో అయితే నెల నెల ప్రీమియం చెల్లిస్తారో అంతా సమానంగా కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలోకి జమ చేస్తుంది. ఈ క్రమంలోనే వ్యక్తి 60 సంవత్సరాల వయసులోకి వచ్చేసరికి ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అందించనున్నారు. ఈ పథకంలో చేరడానికి గరిష్ఠంగా 18 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య ఉన్న రైతులు అర్హులు.ప్రమాదవశాత్తు మరణిస్తే అతని భార్యకు 50% పెన్షన్ చెల్లించే వెసులుబాటు కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మరి ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే కామన్ సర్వీస్ సెంటర్-CSC కు వెళ్లి దరఖాస్తు చేయొచ్చు. ఇందుకు బ్యాంక్ పాస్ బుక్ ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి.
Share your comments