కర్ణాటకలో రాజకియం చివరి అంకానికి చేరుకుంది వచ్చే నెల మే 11 న ఎన్నికలు జరగనున్నాయి ఇదే క్రమంలో పార్టీలు ప్రజలపై ఎన్నికల హామిలను గుప్పిస్తున్నాయి , ప్రతిపక్షాల ఎత్తులను కట్టడి చేసేందుకు ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించింది జేడీఎస్ ఇంతకీ స్కీం ఏంటో ఇక్కడ చూద్దాం !
కర్నాటకలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తున్న జేడీఎస్ పార్టీ అధినేత రైతులకు గొప్ప స్కీం కుమారస్వామి తాము అధికారంలోకి వస్తే రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 లక్షల నజరానా అందజేస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ప్రకటించా రు. సోమవారం కోలార్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ . 'వ్యవసాయదారుల కొడుకులను పెండ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ఎవరూ ముందుకు రావడంలేదని, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ ఓ వ్యక్తి నాకు వినతిపత్రం ఇచ్చాడు. అందుకే ప్రభుత్వం తరఫున ఓ స్కీం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. మమ్మల్ని గెలిపిస్తే కర్నాటక రైతు యువకుల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా ఇంకా అనేక స్కీంలను ప్రవేశపెడతాం' అని ప్రకటించారు.
ఇప్పుడు కర్ణాటక రాజకీయం అంత రైతు , రైతు సమస్యల చుట్టే తిరుగుతుంది క మొన్నటికి మొన్న అమూల్ vs నందిని పాలు అనే వివాదం చుట్టూ తిరిగాయి రాజకీయాలు , ఇప్పటికి ఈ అంశం పైనే చర్చలు జరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయం అంత పాలు రైతు , రైతు సమస్యల చుట్టే తిరుగుతున్నాయి , మే 13 న వెలువడనున్న ఫలితాలలో ఏ పార్టీ అధికారం సాధిస్తుందో చూడాలి .
Share your comments