గత 5 సంవత్సరం నుంచి ఎరురుచుస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడింది . రాష్ట్రంలోని 31 లక్షల రైతులకు రుణమాఫీ చేయనున్నట్లు బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఈ రుణమాఫీ ప్రక్రియ ఆగస్టు 3 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ చివర వరుకు రైతులకు దశలవారీగా రుణమాఫీ చేయనున్నది ప్రభుత్వం ఈ మేరకు తొలిరోజు రుణమాఫీ క్రింద 167.59 కోట్ల నిధులను విడుదల చేసింది దీని ద్వారా తొలిరోజు రూ. 37 వేల నుంచి రూ. 41 వేల వరకు బకాయిలు ఉన్న 44,870 మందికి గురువారం రుణమాఫీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఈ నెల రెండో తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించి మూడో తేదీ నుంచే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. సెప్టెంబరు రెండో వారం వరకు రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్థికశాఖకు గడువు విధించారు. ఈ క్రమంలోనే గురువారం నుంచి చెల్లింపులు ప్రారంభమయ్యాయి. అయితే ఇది వరకే రైతుల రుణ ఖాతాలు మూతబడితే ఆ డబ్బులు ట్రెజరీకి తిరిగి వస్తున్నాయి. ఇప్పటి వరకు తిరిగొచ్చిన డబ్బులు సుమారు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అయితే రైతులు మాత్రం రుణ ఖాతాలు మూతబడితే పొదుపు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని కోరుతున్నారు.
మదనపల్లిలో మార్కెట్లో 45 ఏళ్ల చరిత్ర బ్రేక్ చేసిన టమాటో ..
రాష్ట్రంలోని అన్నదాతలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ రైతు రుణ మాఫీ పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఇందులో భాగంగా గురువారం రూ.37 వేల నుంచి రూ.41 వేల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. దీని ద్వారా బీఆర్‌ఎస్ అంటే రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితమైందని అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు.మరోవైపు రుణమాఫీకి సంబంధించి అనేక ఆందోళనలు నెలకొన్నాయి .
Share your comments