News

ఈరోజే 10వ తరగతి ఫలితాలు విడుదల.. మంత్రి బొత్స ప్రకటన! ఎన్ని గంటలకో తెలుసా?

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్య గమనిక. మొన్న గిరిజన 10వ తరగతి ఫతితాలను విడుదల చేయడానికిఇ ప్రభుత్వం ముహూర్తం పెట్టింది. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలను ఈ రోజు అనగా మే 6వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఫలితాల గురించి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

స్వయంగా ఈ ఫలితాల తేదిని మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. పదవ తరగతి ఫలితాలను విజయవాడలో మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా అతి తక్కువ సమయంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా మంత్రి పదవ తరగతి ఫలితాలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విద్యాశాఖ కూడా ఈ ప్రకటనను ధృవీకరిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను విడుదల చేసిన తర్వాత అధికారిక వెబ్‌సైట్ https://www.bse.ap.gov.in/ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

El Nino: వ్యవసాయ రంగానికి పొంచి ఉన్న ముప్పు!కరువు సంభవించే ప్రమాదం అని హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 18వ తేదీ వరకు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో 8 రోజుల పాటు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 26 వరకు జరిగింది. ఫలితాల విడుదల కోసం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మే రెండో వారంలో ఫలితాలను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానంద రెడ్డి తెలిపారు.

గత సంవత్సరం ఐతే ప్రభుత్వం 10వ తరగతి ఫలితాలను 28 రోజుల్లో విడుదల చేయగా.. ఈ సంవత్సరం మాత్రం కేవలం 18 రోజుల్లోనే విడుదల చేస్తామని తెలిపారు.

సుమారు 30,000 నుండి 35,000 మంది అధ్యాపకులు స్పాట్ వాల్యుయేషన్‌ను సమర్థవంతంగా నిర్వహించారు మరియు ప్రస్తుతం, మార్కుల టేబులేషన్ పని జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ, పరీక్షల ముగింపు మరియు టేబులేషన్ ప్రక్రియలు ముగించి ఫలితాల ప్రకటన 20 రోజుల్లోనే చేసి మరో సంచలనాన్ని సృష్టించడానికి సిద్ధంగా ఉంది.

ఇది కూడా చదవండి..

El Nino: వ్యవసాయ రంగానికి పొంచి ఉన్న ముప్పు!కరువు సంభవించే ప్రమాదం అని హెచ్చరికలు

Related Topics

Andhra Pradesh 10th results

Share your comments

Subscribe Magazine

More on News

More