News

రైతుల ఆదాయాన్ని పెంచడానికి “1000” FPO ల స్థాపన!

Srikanth B
Srikanth B

చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా దేశంలో మరిన్ని రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO )ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సోమవారం తెలిపారు.

సిఐఐ-ఎన్ సిడిఎక్స్ ఎఫ్ పిఒ శిఖరాగ్ర సమావేశం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రూ.6,865 కోట్ల వ్యయంతో 10,000 ఎఫ్ పిఒలను ఏర్పాటు చేసే పథకాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని, ఈ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు

 

చిన్న మరియు సన్నకారు రైతుల పురోగతిని నిర్ధారించడంలో ఎఫ్ పిఒలను ఏర్పాటు చేసే కార్యక్రమం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని  తోమర్ అన్నారు.

దాదాపు 86  శాతం మంది రైతులు 1. 1 హెక్టార్ల కంటే తక్కువ సగటు భూములను కల్గిన  చిన్న మరియు సన్న కారు రైతులు ఉన్నారని . భారతీయ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి మరియు రైతులకు శ్రేయస్సును కొరకు తమ ప్రభుత్వం పనిచేస్తుందని అయన అన్నారు.

 

వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని, పంట వైవిధ్యతను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలతో అధిక విలువ కలిగిన పంటలను పండించడానికి రైతులను ప్రోత్సహిస్తోందని మంత్రి అన్నారు.

వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంచే లక్ష్యంతో, 2014 లో ప్రభుత్వం వ్యవసాయ పరపతి లక్ష్యాన్ని రూ.6-7 లక్షల కోట్ల నుండి సుమారు రూ.18 లక్షల కోట్లకు పెంచిందని

ప్ర భుత్వం ప్ర ధాన మంత్రి-కిసాన్ ప థ కాన్ని కూడా ప్రారంభించింది, దీని కింద సుమారు 11 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.1.82 ల క్ష ల కోట్ల ను నేరుగా బదిలీ చేసినట్లు ఆయ న పేర్కొన్నారు.

 

పేర్కొన్న తోమర్, ఎఫ్ పిఒలు ఈ నిధి నుండి ఆర్థిక సహాయం కూడా పొందవచ్చని చెప్పారు. "మన దేశంలో చిన్న మరియు సన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఎఫ్ పిఒలను విస్తరించాల్సిన అవసరం ఉంది" అని తోమర్ అన్నారు. ఇన్ పుట్ ల యొక్క బల్క్ కొనుగోళ్లు, ఆధునిక వ్యవసాయ పరికరాల యొక్క సమిష్టి వినియోగం మరియు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఖర్చును తగ్గించడంలో

 

ఎఫ్ పిఒలు రైతులకు సహాయపడతాయి.

 

రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర   పాత్ర పోషించగలవని  మంత్రి అన్నారు. అందువల్ల, ఎఫ్ పిఒ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు ,దాదాపు అన్ని పంటల ఉత్పత్తిలో భారతదేశం మొదటి లేదా రెండవ స్థానంలో ఉందని తోమర్ అన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మరియు ఆరోగ్యకరమైన ఎగుమతుల పరంగా వ్యవసాయ రంగం కీలకంగావుందని,

ఎఫ్ పిఒల పనితీరును మరింత మెరుగుపరచడానికి పరిశ్రమ సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తుందనితోమర్ హామీ ఇచ్చారు.2027-28 వ ర కు "10,000 ఎఫ్ పిఒ ల ఏర్పాటు, ప్రోత్సాహం" కోసం కేంద్ర రంగ ప థ కాన్ని ప్ర భుత్వం ఆమోదించి ప్రారంభించింది.

Share your comments

Subscribe Magazine

More on News

More