తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో వరి పంట కొనము అని తేల్చి చేపిన తరువత కొంత మంది రైతులు ప్రత్యామ్న్యాయ పంటల సాగు వైపు చూస్తున్నారు అయితే వరి పంట సాగు చేసినంత సులభంగ ఇతర పంటలను సాగుచేయడం చాల కష్టం గానే భావిస్తుంటారు .దానికి గల కారణం ఈ వాణిజ్య పంటల యాజమాన్యం లో చాల మంది రైతులకు మెళుకువలు తెలియకపోవడం ఒక కారణం అయితే ఇతర పంటలకు ఆశించే చీడ -పీడల బెడదల నుంచి పంటలను రక్షించడం చాల కష్టం గ దీని రైతులు భావిస్తారు ముఖ్యం గ పండ్లు మరియు కూరగాయల తోటల పెంపకం లో అయితే వీటి నిర్ములనకు లింగాకర్షక బుట్టల ఉత్తమముగా పనిచేస్తాయి .
అసలు ఈ లింగాకర్షక బుట్టల ఏమిటి ?
కూరగాయల మరియు పండ్ల తోటల్లో ముఖ్యం బాక్టీరియా మరియు వైరస్ తెగుళ్ల ను ప్రధానంగ తెల్ల దోమ , నల్ల దోమ . వివిధరకాల దోమలు మరియు కొన్ని మిడతలు మొక్కలపై వాలడం , గుడ్లుపెట్టడం ద్వారా ఈ తెగుళ్ళకు ప్రధాన వాహకాలు గ ఉంటాయి . వీటి యొక్క ఉద్ధృతి పంటలలో నిర్ములించ గలిగితే దాదాపు చాల రకాల తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించు కోవచ్చు అయితే వీటినీ అరికట్టడానికి కి లింగాకర్షక బుట్టలు ఉత్తమముగా పనిచేస్తాయి . లింగాకర్షకాలు అనగా తోటలపై వల్లే ఈగలు , దోమలు , ననల్లులు , మిడతలు ఒక్కొకటి ఒకో రకమైన రంగులకు ఆకర్షితులు అవుతాయి , వీటిలో ప్రధానం గ పసుపు రంగు లింగాకర్షక బుట్టలు మరియు నీలి రంగు బుట్టలు ఉనికిలో ఉన్నాయి .
పసుపురంగు లింగాకర్షక బుట్టలు : తెల దోమ , నల్ల దోమ, పచ్చ దోమ , వివిధ రకాల ఈగ లను ఆకర్షిస్తుంది.
నీలి రంగు లింగాకర్షక బుట్టలు : ఆకులను తినే మిడత లనూ ఆకర్షిస్తుంది.
క్రిమిసంహారక మందుల ద్వారా వీటిని నిర్ములించ వచ్చు కానీ సాగు యొక్క వ్యయం అదికం అవుతుంది , అవి వచ్చాక నిర్ములించడం కంటే ఈ బుట్టలు అమర్చడం ద్వారా వాటి ఉదృతి ని అరికట్టవచ్చు మరియు వీటి యొక్క ఖర్చు చాల తక్కువ . వీటిని ఇంటిలోకూడా తాయారు చేసుకోవచ్చు.
తయారు చేసే విధానం : ముందుగా పసుపు మరియు నీలి రంగు అట్టలను తీసుకొని వట్టికి నూనె లేదా ఆముదం నూనె లేదా వెస్లిన్ జెల్లీ ను అట్ఠ లకు రాసి ఎకరానికి 10 చొప్పున అమర్చుకోవాలి . తోటలో అమర్చే టప్పుడు వీటిని అధిక ఎత్తులో కాకుండా ఆయా పంటలను బట్టి వాటికీ ఒక గజం ఫై ఎత్తుకు కట్టుకోవాలి . వీటిని అమర్చడం ద్వారా ఆ రంగులకు ఆకర్షితులైన పురుగులు ఆయా రంగులపై వాలి ఆ జిగురుకు అంటుకొని చనిపోతాయి . వీటిని బట్టి ఆయె పురుగుల బెడద అధికంగా ఉందొ తెలుస్తుంది , వీటి యొక్క ఉద్ధృతి మరి ఎక్కువ ఉంటే క్రిమి సంహారకాలు వాడి వాటిని అరికట్టి పంటను రక్షించుకోవచ్చు.
ఇంకా చదవండి .
నిరుద్యోగులకు శుభావార్త !హైదరాబాద్ లో నెలకు 35000/ వేలు ఇచ్చే ఇంటర్న్షిప్ ... దరఖాస్తు చేసుకోండి ఇలా
Share your comments