తెల్ల బంగారం అని పిలవబడే పత్తి సాగు తెలుగు రాష్ట్రాల్లో చాల ప్రాముఖ్యం ఉన్న పంట. మన రాష్టం లోనే కాకా ప్రపంచ మార్కెట్ లో పత్తి కి ఎల్లపుడూ ఉండే డిమాండ్ గురించి వేరే చెప్పకర్లేదు. పత్తి సాగు చేసేటప్పుడు పూర్తి లాభాలు పొందాలి అనుకుంటే ఈ యాజమాన్య పద్దతులను తప్పక పాటించాలి. పతి సాగు లో మెళకువలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
విత్తనాలు : మంచి పంట చేతికి రావాలి అంటే సరైన విత్తనాలను ఎంచుకోవాలి. తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో అధిక లాభాలు ఇస్తున్న కొన్ని పత్తి విత్తనాలు ఇవి : US 7076, సదానంద్ BG-II , నూజివీడు - ఆధ్య , నవనీత్, Raashi 659, కావేరి ATM, ప్రవర్ధన్ -రేవంత్
పత్తి సాగు చేయడానికి నల్ల మట్టి అనుకూలంగా ఉంటుంది. పత్తి విత్తదానికి ఏప్రిల్ - మే కాలం ఉత్తమమైనది, అయినప్పటికీ తెలుగు , తమిళ రాష్ట్రాల్లో వర్షపాతాన్ని అనుసరించి పత్తిని విత్తడం మంచిది. పత్తి సాగుకు నీరు అధికం గా అవసరం అవుతుంది.
ఇది కూడా చదవండి
40 ఏళ్లపాటు నికర ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారా! అయితే ఈ పంటను సాగు చేయండి
పత్తి మొక్కల మధ్య కనీసం 2 అడుగుల దూరం తప్పనిసరి ఉండాలి, అప్పుడే మొక్క ఎదుగుదల సవ్యంగా ఉంటుంది. పంట కి నీరు పెట్టేటప్పుడు ప్రతి మొక్క మొదళ్లకు నీరు అద్దుతుందో లేదా శ్రద్ధ వహించాలి. లేకపోతే ఇది మొక్క ఎదుగుదలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ పద్దతి ప్రకారం నీటిని అందించడం ద్వారా సరైన సమయానికి, సరైనంత నీరు ప్రతి మొక్క కి అందించొచ్చు.
పత్తి సాగులో పూత పూసెదశ, పిందె, కాయ తయారయ్యే దశలు నీరు అందించాల్సిన క్లిష్టమైన దశలు. నీటి అవసరం ,మొదటి 60-70 రోజుల్లో తక్కువగానూ , పూత మరియు కాయ పెరిగే దశల్లో ఎక్కువగాను ఉంటుంది.
పత్తిలో కలుపు మొక్కల కారణంగా పంట 50-85% తగ్గిపోయే అవకాశం ఉంది. పోలం లో కలుపు మొక్కలు ఉన్నట్లైతే, పెండమిథాలిన్ లేదా ఫ్లూక్లోరలిం ని హెక్టర్ కు 1 kg చొప్పున వాడితే కలుపు తొలగిపోతుంది.
ఇది కూడా చదవండి
Share your comments