ఒకప్పటిలాగా కాకుండా, ప్రస్తుతం రైతులు కొత్త రకాల పంటల మీద ఆశక్తి చూపిస్తున్నారు. పుచ్చకాయ పంట గురించి చాలా మంది రైతులకు సుపరిచితమే, అయితే పంట నుండి మంచి లాభాలు పొంది, ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి గింజలు లేని పుచ్చకాయను సాగు చెయ్యడం మంచిదని శాస్తవేత్తలు చెబుతున్నారు. గింజలు లేని పుచ్చ రకాన్ని కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పంటను సాగు చెయ్యడం ద్వారా మరొక్క ప్రయోజనం ఏమిటంటే, తక్కువ ఖర్చుతోనే అధిక లాభాలను పొందవచ్చు.
ఆర్థికంగా నిలుదొక్కుకోవాలంటే కొత్తగా ఆలోచించాలి. కొత్త పంటలు పండించాలి. అలాగే పంట తినేవారికి చక్కటి సౌకర్యంతో పాటు చక్కటి రుచి ఉండాలి. అలా నేటి కాలంలో ఎన్నో గింజలు లేని పండ్లను పండిస్తున్నారు రైతులు. అలాగే ప్రజల రుచులు..అభిరుచులకు తగినట్లుగా పంటలు పండిస్తున్నారు.పండ్లలో పోషకాలు తగ్గకుండా..రుచిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటువంటి పంటల్లో రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది ‘గింజలు లేని పుచ్చ పంట’.
వంటికి చలవ చేసే పుచ్చకాయను వేసవికాలంలో ఎక్కువుగా తినడానికి ప్రజలు ఇష్టపడతారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో వేల టన్నుల్లో పుచ్చకాయలు ఎగుమతులు మరియు దిగుమతులు జరుగుతాయి. పుచ్చకాయ రుచి ఎక్కువుగా ఉన్నప్పటికీ, దానిలోని గింజలు పంటికి తగులుతూ తెగ ఇబ్బంది పెడతాయి. గింజలు లేని పుచ్చకాయలు రుచి బాగుండటమే కాకుండా, తినడానికి సౌలభ్యంగా కూడా ఉంటాయి. గింజలు లేని పుచ్చ అనేది అసాధారణ హైబ్రీడ్ విత్తనం, ఇది రైతులకు అధిక లాభాలు తెచ్చిపెడుతుంది.
ఈ సీడ్లెస్ పుచ్చ పంట రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే చక్కటి పంట. ఎకరానికి రూ.50 వేల ఖర్చు పెడితే చాలు నాలుగు నెలల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి రూ.1.2 లక్షల వరకు ఆదారం తెచ్చిపెడుతుంది. కేరళ అగ్రి వర్సిటీలోఒక్కో గింజను రూపాయి చొప్పున అమ్మకానికి పెట్టారు. కిలోకి 30వేల గింజలు వస్తాయి.
Share your comments