Kheti Badi

వేసవిలో తప్పకుండా పాటించవలసిన పంట రక్షణ చర్యలు

KJ Staff
KJ Staff

వేసవి కాలంలోకి సమీపిస్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. మే నెలలో అధిక ఉష్ణోగ్రతతో కూడిన వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ పరిస్థిత్తుల్లో వేసవిలో పంట సాగుచేసేవారు కొన్ని ముఖ్యమైన పంట రక్షణ చర్యలు పాటించవలసి ఉంది.

భారత వాతావరణ కేంద్రం, హీట్ వేవ్స్ కారణంగా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణతో పాటు, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. హీట్ వేవ్స్ వలన సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని సూచించింది. పెరిగే ఉష్ణోగ్రతలు నుండి పంటను కాపాడుకోవడానికి రక్షణ చర్యలు అవలంభించాలి. వాటి గురించి ఇప్పుడు తెల్సుకుందాం.

నీటి యాజమాన్యం:

అధిక ఉష్ణోగ్రతలు నుండి పంటను రక్షించడానికి సరైన నీటి యాజమాన్య పద్దతులను పాటించడం ఎంతో కీలకం. వేసవి సమయంలో పళ్ళ తోటలు, కూరగాయ తోటలు ఉన్న రైతులు నీటి లభ్యత ఉండేలా చర్యలు చేపట్టాలి. నీటి లభ్యత తక్కువుగా ఉన్న ప్రాంతాల్లో బిందు సేద్యం ద్వారా పంటలు పండించడం ఉత్తమం. ఈ పద్దతి ద్వారా నీటి వృధా తగ్గుతోంది. ఉదయం లేదా సాయంకాలం నీటిని అందించడం ద్వారా, వేడికి నీరు ఆవిరైపోకుండా మొక్కలకు అందుతుంది.

ముళ్చింగ్:

ప్లాస్టిక్ షీట్ తో మట్టిని కప్పడాని ముళ్చింగ్ అంటారు. ముళ్చింగ్ కి ప్లాస్టిక్ షీట్ తో లేదా ఆకులు, గడ్డిని వినియోగించవచ్చు. ముళ్చింగ్ చెయ్యడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా ముళ్చింగ్ మట్టిలోని తేమ శాతాన్ని కాపాడుతుంది, అలాగే మొక్కలకు అందించిన నీటిని పట్టి ఉంచి నీటిని ఆవిరి కానివ్వకుండా మొక్కలకు అందేలా చేస్తుంది. ముళ్చింగ్ ద్వారా మరొక్క ఉపయోగం ఏమిటంటే కలుపు మొక్కలు రాకుండా నియంత్రిస్తుంది.

షడే నెట్ వినియోగం:

పాదు కూరగాయలు, లేదా నీడ అవసరమున్న మొక్కలను షెడ్ కింద సులభంగా పెంచవచ్చు. షెడ్ వినియోగం ద్వారా అధిక ఉష్ణోగ్రత నియంత్రించబడి, ఎండ వేడికి నీరు ఆవిరికావడని తగ్గించి, మొక్కకు అనువైన వాతావరణాన్ని కలిగిస్తుంది.

మేలైన రకాల ఎంపిక:

ఎండ వేడిని తట్టుకుని నిలబడి, అధిక లాభాలు అందించగలిగే అనేక రకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని వినియోగించడం ద్వారా పంట నష్టం తగ్గి మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.

ఈ విధంగా అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకుని నిలబడగలిగేలా సమగ్ర రక్షణ చర్యలు పాటిస్తూ వేసవి కాలంలో పంట నష్టపోకుండా అధిక లాభాలు పొందేందుకు వీలుంటుంది.

Share your comments

Subscribe Magazine