Kheti Badi

చెరుకు సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే విత్తన ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...!

KJ Staff
KJ Staff

దేశ వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో చెరుకు సాగును ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో సుమారు లక్షన్నర హెక్టార్లలో చెరకు పంటను సాగు చేస్తూ అధిక దిగుబడులను సాధిస్తున్నారు. అధిక సేంద్రియ పదార్థంగల తేలికపాటి నీరు నిలువని ఇసుక నేలలు చెరుకు పంటకు అనుకూలమైన గా చెప్పవచ్చు. ముఖ్యంగా చెరుకు సాగునుజనవరి, మార్చి మాసాల్లో నాటుకోవచ్చు .నాటుకోవడం ఆలస్యమైతే కొన్ని అనువైన రకాలను ఎన్నుకొని మార్చి, మే నెల వరకు నాటుకోవచ్చు. ముఖ్యంగా చెరుకు సాగులో నాణ్యమైన దిగుబడిని సాధించాలంటే మనం ఎన్నుకొనే నాణ్యత పైనే ఆధారపడి ఉంటుంది.

విత్తనం ఎంపిక:

చెరుకు విత్తన ఎంపికలో మొదట పూత పూయని చెరుకుల చిగురు భాగంగాని లేదా 7 నుంచి 8 నెలల వయస్సుగల లేవడి తోటల చెరుకును మూడు కళ్ళ ముచ్చెలుగా కొట్టి విత్తనంగా మాత్రమే వాడాలి.ఎకరానికి 16,000 మూడు కళ్ళ ముచ్చెలను వాడాలి. చెరుకులో అధికంగా వచ్చే పొలుసు పురుగు, అనాసకుళ్ళు తెగులును సమర్థవంతంగా నివారించడానికి
మనం విత్తనంగా వాడే మూడు కళ్ళముచ్చెలను 300 లీటర్ల నీటికి 150 గ్రా.ల కార్బెండిజిమ్ మరియు 600 మి.లీ. మలాథియాన్ కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ఉంచి ప్రధాన పొలంలో నాటుకోవాలి.

చెరుకు సాగులో లేవడి తోటలను పెంచేందుకు ముదురు తోటల నుంచి సేకరించిన గడలను మొదలు, చివరి 1/3 భాగాలను తీసివేసి మూడు కళ్ళ ముచ్చెలుగా చేసి, వేడి నీటిలో 52° సెల్సియస్ వద్ద 30 నిమిషాలు లేదా తేమతో మిళితమైన వేడి గాలిలో 54° సెల్సియస్ వద్ద 4 గంటలు విత్తనశుద్ధి చేసుకున్నట్లయితే చెరుకు పంటను అధికంగా నష్టపరిచే కాటుక తెగులు,గడ్డిదుబ్బు తెగులు, ఆకుమాడు తెగుళ్ళను సమర్ధవంతంగా నివారించవచ్చు.

విత్తన శుద్ధి తర్వాత మూడు కళ్ళముచ్చెలను ముందుగానే మనం తయారు చేసుకున్న 80-100 సెంటి మీటర్లు దూరం గల సాలల్లో నాటుకోవచ్చు. లేదా జంటసాలల్లో నాటుకోవాలి అనుకుంటే 60-120 సెం.మీ. దూరంలో 2.5 సెం.మీ.లోతు మించకుండా నాటుకోవాలి. ఈ విధంగా సరైన విత్తనాలను ఎంపిక చేసుకుని సరైన జాగ్రత్తలను పాటించిన అప్పుడే చెరుకు పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడి సాధిస్తుంది.

Share your comments

Subscribe Magazine