Kheti Badi

జామలో లో వచ్చే తెగుళ్లు,పురుగుల నివారణకు తీస్కోవలసిన చర్యలు

KJ Staff
KJ Staff
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండే పంటగా జామ కు మంచి పేరు ఉంది. ఆరోగ్యవంతమైన పంట ఎంత దిగుబడి ఇస్తుందో అలాగే ఒక సారి పంటకు తెగుళ్లు చీడలు వచ్చాయంటే అంతగా పంటను నాశనం చేస్తాయి. ముఖ్యంగా జామలో కనిపించే పురుగులు, తెగుళ్ల రకాలు...

పురుగులు:

తెల్ల సుడిదోమ : వీటి పిల్ల పురుగులు ఆకుల పై తెల్లని దూది వంటి మెత్తని పదార్ధంతో కప్పబడి రసం పిలుస్తాయి. ఆశించిన ఆకులు ఎర్రబడి ముడతలు పడతాయి. ఫెబ్రవరిలో చాలా తీవ్రస్దాయికి చేరి నష్టం కలుగచేస్తాయి. దీని నివారణకు రాత్రులందు జిగురు పూసిన పసుపు రంగు డబ్బాలను తెల్లదోమ ఆశించిన చెట్ల వద్ద ఉంచాలి. ప్రాధమిక దశలో ఆశించిన కొమ్మలను కత్తిరించి వేసి వీటి తీవ్రతను తగ్గించవచ్చు. వీటి ఉధృతి ఎక్కువైనచో ఫాస్పోమిడాన్ లేక డైక్లోరోవాస్ 1 మి. లీ. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పండు ఈగ : కాయలు పక్వానికి రాగానే పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 2 మి. లీ. మిధైల్ యుజినాల్, 3 గ్రా. కార్బోఫ్యురాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపి తయారు చేసిన ద్రావణాన్ని పోసి తోటలో అక్కడక్కడ చెట్ల కొమ్మలకు వ్రేలాడదీయాలి. దీని వలన మగ ఈగలు ఆకర్షించబడి, మందు ద్రావణంలో పడి చానిపోతాయి. 2 మి. లీ. మలాధియాన్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పిండినల్లి : చిన్న, పెద్ద పురుగులు కొమ్మల చివర, కాయలను ఆశించి రసాన్ని పిలుస్తాయి. కాయలు, ఆకులు రాలిపోతాయి. ఇవి జిగురు పదార్ధాన్ని విసర్జించడం వల్ల మసి తెగులు ఆశిస్తుంది. ఆశించిన కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. ఎసిఫేట్ 75 యెస్.పి 1 గ్రా. లేదా 1 మి. లీ. డైక్లోరోవాస్ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
నులి పురుగులు : ఇవి ఆశించిన చెట్ల ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోవడం, కమ్మలు ఎండి పోవడం, తక్కువ దిగుబడి ఇవ్వడం వంటి చెట్టుకు 100 కిలోల పశువుల ఎరువు, 250గ్రా. వేప పిండి, నులి పురుగుల గుడ్డు పై పరాన్నజీవిగా ఉండే శీలీంధ్రం పేసిలోమైసెన్ లీలాసినస్ 25గ్రా. తో పాటు, 60గ్రా. కార్బోఫ్యురాన్ గుళికలను చెట్టు పాదులో వేయడం ద్వారా వీటి ఉధృతిని అరికట్టవచ్చు.

తెగుళ్ళు:

గజ్జి తెగులు : ఇది ప్రధానంగా పచ్చికాయల పై కనిపిస్తుంది. కాయల పై చిన్న త్రుప్పు రంగులో లేదా గోధుమ రంగులో ఉన్న మచ్చలు పగలకుండా కన్పిస్తాయి. కాయ సైజు పైరిగే కొద్ది మచ్చలు పెరిగి, కాయలు పగిలి అంచులు ఎత్తుగా ఉంటాయి. ఈ తెగులు సోకిన కాయలు సరిగ్గా పెరగక, గట్టిగా ఉండి రాలటం జరుగుతుంది. ఈ తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి 2-3 సార్లు 15 రోజులు వ్యవధితో పిచికారి చేయాలి.
ఎండు తెగులు : తెగులు ప్రారంభమైన కొద్ది కాలంలో ఆకులు పసుపుపచ్చ రంగుకు మారుతాయి. కొమ్మలు పై నుండి క్రిందకి ఎండుతాయి. ఎక్కువగా చెట్టు క్రింది భాగం కొమ్మల క్రిందకి ఎండుతాయి. ఆకులు వడలిపోయి రాలిపోతాయి. చెట్టు మోడుబారుతుంది. ఈ తెగులు తీవ్రత తగ్గించేందుకు వర్షపునీరు మొక్కల మొదళ్ళలో నిల్వకుండా చూడాలి. మొక్కకు కిలో చొప్పున జిప్సం వేసి, పచ్చిరోట్ట లేదా పశువుల ఎరువు ఎక్కువగా వేసుకోవాలి. 90 కిలోల పశువుల ఎరువుకు 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి అనే జివశిలింrధ్రనాశినిని కలిపి ప్రతి చెట్టుకు పాడుచేసి 30-40 కిలోలు వేయాలి. తెగులు ఆశించిన మొక్కలకు కార్బండాజిమ్ లేదా బెనోమిల్ 1 గ్రా. లేదా కాపర్ అక్సిక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధితో మూడు సార్లు మొదలు చుట్టూ నేల తాడిచెటట్లు పోయాలి.
ఆంత్రాక్నోస్ మరియు కాయ కుళ్ళు : లేత కొమ్మలు, ఆకులు మరియు కాయలు గోధుమ రంగుకు మారి తర్వాత నల్లగా మారి కొమ్మ మొత్తం ఎండిపోతుంది. పూర్తిగా మాగిన పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు చిన్న చిన్న గుంతలుగా ఏర్పడుతాయి. ఈ మచ్చల మధ్య భాగంలో గులాబీ రంగును కలిగి ఉంటాయి. ఇలా ఏర్పడిన రెండు, మూడు రోజుల్లో పండ్లు కుళ్ళిపోతాయి. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3గ్రా. లీటరు నీటిలో కలిపి కాయ తయారయ్యే సమయంలో 10-15 రోజుల వ్యవధిలో కాయ పూర్తిగా తయారయ్యే వరకు పిచికారి చేయాలి.

Related Topics

guava cultivation farmer

Share your comments

Subscribe Magazine