పూలలో మల్లెపువ్వు చాలా ముఖ్యమైనది. సువాసన కలిగి ఉండే మల్లెపువ్వును ఇష్టపడని వారుండరు. భారతదేశంలో వాణిజ్యపరంగా మల్లెపూల సాగును రైతులు చేపడుతున్నారు. స్త్రీల అలంకరణలో మల్లెపూలకు ప్రత్యేకమైన స్ధానం ఉంది. దేశవ్యాప్తంగా 40 రకాలకు పైగా మల్లె జాతులు ఉన్నాయి. కష్టమైనా ఎంతో ఇష్టంగా చాలా మంది రైతులు మల్లె సాగును చేపడుతున్నారు. దేశ వ్యాప్తంగా తీసుకుంటే దీని సాగు విస్తీర్ణం 6385 హెక్టార్ల వరకు ఉండగా 32935 టన్నుల వరకు పూల దిగుబడి ఉండవచ్చని అంచనా. విడిపూలుగా, దండలు, బొకేలు, తయారీకి వినియోగిస్తారు. మొత్తం ఉత్పత్తిలో కొంత భాగం పరిమిళ భరితమైన అత్తరు, తలనూనెల తయారీకి వాడతారు.
మల్లెలో ముఖ్యంగా మొగ్గ తొలచు పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. పురుగు యొక్క లార్వా , పువ్వు మొగ్గలోకి చొచ్చుకొని పోయి పూల భాగాలను తినేస్తూ మొగ్గలు ముడుచుకుపోయేలా చేస్తుంది. దీని నివారణకు మలథియాన్ లీటరు నీటికి 2మి.లీ మందును కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. నల్లి పురుగు ఉధృతి మల్లెలో అధికంగా ఉంటుంది. పొడివాతావరణలో ఈ పురగు పంటను ఆశిస్తుంది. ఆకుల అడుగుబాగానికి చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపురంగుకు మారి రాలిపోతాయి. దీని నివారణకు గంధపు పొడిని ఎకరానికి 10కిలోల చొప్పున చల్లుకోవాలి.
ఆకు ఎండు తెగులు మల్లెలో నష్టాన్ని కలిగిస్తుంది. తెగులు ఆశించిన ఆకులు దళసరిగా మారిపోతాయి. ఆకు భాగంలో ఎరుపు రంగు మచ్చలు ఏర్పాడతాయి. దీని నివారణకు మాంకోజెబ్ 3గ్రా, లేదా కార్బెండిజమ్ 1గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండు తెగులు కారణంగా మల్లెలో మొక్క కింది భాగంలో ఆకులు ఎండిపోవటం తరువాత పైభాగంలో ఆకులు ఎండిపోయి రాలిపోవటం జరుగుతాయి. చివరకు మొక్కంతా ఎండిపోయి చనిపోతుంది. దీనిని గుర్తించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 2గ్రాములు లీటరు నీటిలో కలిపి భూమిని తడపాలి.
Share your comments