పొగాకు పండించే రైతులకు ప్రధాన సమస్య పొగాకు లద్దెపురుగు, దీనినే స్పాడోప్తురా లెప్తురా అని కూడా పిలుస్తారు. ఈ పురుగు పొగాకు పంటను ఆశించి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంది. దీని నివారణ చర్యల కోసం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించడం ఎంతో అవసరం.
ఆంధ్ర ప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో పొగాకును అధిక భూభాగంలో పండిస్తారు. పొపొగాకు పండించే జిల్లాలో గోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ప్రదమైనవని. పొగాకు సాగుకు బలమైన నల్ల నేలలు అవసరం. పొగాకు సాగుచేసే సమయంలో అనేక రకాల చీడ పీడలు మొక్కలను ఆశిస్తాయి, అయితే వీటన్నిటిలోకెల్లా ప్రధానమైనది పొగాకు లద్దెపురుగు. దీనినే శాస్త్రీయంగా స్పాడోప్టెరా లెప్తురా అని కూడా పిలుస్తారు. పొగాకుతో పాటు టమాటో, కాప్సికం, బంగాలదుంప వంటి ఇతర పంటలను కూడా ఆశించి భారీ పంట నష్టాన్ని మిగులుస్తుంది. ఈ పురుగు లార్వా దశలో ఉన్నపుడు మొక్కను ఆశించి దిగుబడి తగ్గేలా చేస్తుంది. దీనిని నియంత్రించడానికి అధిక మొత్తలంలో పురుగుమందులను ఉపయోగిస్తున్నారు, దీని వలన పర్యావరణ కాలుష్యంతో పాటు, ఈ పురుగులకు మందులు వినియోగాన్ని తట్టుకునే సామర్ధ్యం లభిస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి పురుగు మందుల వినియోగంతో పాటు సస్యరక్షణ చర్యలు పాటించడం అవసరం.
పొగాకు లద్దెపురుగు, తల్లిపురుగు ఆకుల మీద గుడ్లు పెడుతుంది, గుడ్ల నుండి బయటకి వచ్చిన పిల్లలు ఆకులను పూర్తిగా తినేస్తాయి. ఈ లార్వాలు ఆకులతో పాటు మొక్క కాండం భాగాన్ని కూడా నాశనం చేస్తాయి. కేవలం పురుగుమడులతోనే వీటిని నియంత్రించడం సాధ్యపడదు. సమగ్ర నివారణ పద్దతులు పాటిస్తూ వీటిని వీటిని సంఖ్యను తగ్గించాలి. తల్లిపురుగు ఆకుల మీద గుడ్లు పెట్టేసమయంలో ఆకులపైనా భాగాన్ని లోపటి వరకు చీల్చి దానిలో గుడ్లు పెడుతుంది, తద్వారా ఆకులు ఎండిపోయినట్లు కనిపిస్తాయి. ఇటువంటి ఆకులను గుర్తించి నాశనం చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా వీటిని సంతతి పెరగకుండా చెయ్యగలం. దీనితో పాటు పొలంలో లింగాకర్షక బుట్టలు, కాంతి ఎరలు ఏర్పాటు చేసుకోవాలి. తల్లిపురుగులు వీటికి ఆకర్షించబడి, ఈ ఎరల్లో చుక్కుకుని చనిపోతాయి. మగపురుగులను ఈ బుట్టలు ఆకర్షిస్తాయి, మగ పురుగులు తగ్గిపోవడం ద్వారా గుడ్ల ఉత్పత్తి జరగదు.
పొగాకు లద్ధిపురుగులు నివారించడంలో జీవ నియంత్రణ చర్యలు చక్కగా పనిచేస్తాయి. ట్రైకోగ్రామా చిలోనిస్ అనే కీటకాలను పొలంలో వదలడం ద్వారా ఈ లార్వా, పొగాకు లద్దెపురుగు లార్వాలను ఆశించి వాటి సంఖ్య తగ్గిస్తుంది. వీటితో పాటు జీవ ఆధారిత పురుగు మందులైన బెవెరియా బెసియన, బ్యాసిల్లుస్ తరింగ్జెనిసిస్ చక్కగా పనిచేస్తాయి. వీటిని ఒక లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి 10 రోజులకు ఒకసారి మొక్కల మీద పిచికారీ చెయ్యాలి. పొగాకు లెద్దెపురుగు నివారణకు రసాయన పురుగుమందులు వాడటం శ్రేయస్కరం కాదు. వీటిని తరచూ వాడటం వలన పురుగులకు ఈ మందులను తట్టుకొని నిలబడగలిగే సామర్ధ్యం లభిస్తుంది తర్వాత పురుగుమందులు వాడిన ప్రయోజనం కనబడదు. వీటి ఉదృతి ఎక్కువగా ఉన్న సమయంలో క్లోరాంత్రానిప్రోల్ , లేదా స్పైనోషడ్ మందులను ఒక లీటర్ నీటికి 0.4ml కలిపి పది రోజులకు ఒకసారి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తూ రైతులు, పురుగుల బారినుండి మొక్కలను కాపాడి అధిక దిగుబడులు పొందవచ్చు.
Share your comments