పుట్టగొడుగుల్లో పోషకవిలువలు అనేకం. పుట్టగొడుగుల్లో మాంసాహారంల ఉన్నన్ని పోషకాలు ఉంటాయి, కాబట్టి శాఖాహారులు వీటిని ఎటువంటి భయం లేకుండా తినవచ్చు. మార్కెట్లో పుట్ట గొడుగులు డిమాండ్ పెరుగుతుండడంతో చాలా మంది రైతులు మరియు ఎంతో మంది యువత పుట్టగొడుగులు సాగు చేసేందుకు ఆశక్తి చూపిస్తున్నారు. అయితే పుట్ట గొడుగులా పెంపకానికి అతిముఖ్యమైనది స్పాన్, పుట్టగొడుగుల పెంపకంలో విజయం సాధించడంలో స్పాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనిని ఎలా తయారుచేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
పుట్టగొడుగుల్లో అనేక రకాలున్నాయి, వాటిలో ఆలుచిప్ప ముష్రూమ్స్, బటన్ ముష్రూమ్స్, మరియు పాల పుట్టగొడుగులు ముఖ్యమైనవి. పుట్టగొడుగుల పెంపకం మొదలుపెట్టేముందు అవసరమైన స్పాన్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఈ స్పాన్ ఆరోగ్యకరమైనదై ఉండాలి, లేకుంటే పెంపకంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది ఈ స్పాన్ బయట కొనుగోలు చేస్తారు, దీనిని కోసం అదనంగా ఖర్చు చెయ్యవలసిన అవసరం లేకుండా, కొన్ని మెళుకువలు పాటిస్తూ సొంతంగా స్పాన్ తయారుచేసుకునే అవకాశం ఉంది. దీనికోసం జొన్న లేదంటే గోధుమ విత్తనాలను సేకరించాలి, ఈ విత్తనాల్లో ఎటువంటి రోగాలు లేనివై ఉండాలి.
సేకరించిన విత్తనాలను నీటిలో 30 నిముషాలు ఉడకబెట్టాలి, ఇలా చెయ్యడం ద్వారా విత్తనాలోని శిలింద్ర బీజాలు చనిపోతాయి. ఉడకబెట్టిన విత్తనాలకు కాల్షియమ్ సల్ఫేట్ పౌడర్ పట్టించాలి. ఒకకిలో జొన్న విత్తనాలకు 5 గ్రాముల కాల్షియమ్ సల్ఫేట్ సరిపోతుంది. కాల్షియమ్ సల్ఫేట్ విత్తనాల్లో ఉదజని సూచిక 7.5 శాతానికి చేర్చి, పుట్టగొడుగుల సిలింద్రం వేగంగా పెరిగేందుకు తోడ్పడుతుంది. ఇలా తయారుచేసిన విత్తనాల్ని ప్లాస్టిక్ ఓవర్లు లేదా సీసాల్లో వేసి, గాలి చొరబడకుండా, మూసిఉంచాలి. ఇప్పుడు ఈ విత్తనాల్ని గది ఉష్ణోగ్రత వద్ద ఒక 24 గంటలపాటు ఉంచాలి.
ఇలా తయారుచేసుకున్న మదర్ కల్చర్ ను సీసాల్లో వేసి, దానిలోకి గాలిచొరబడకుండా మూసేసి, ఇంక్యుబేట చెయ్యాలి. ఈ మదర్ కల్చర్ ను 15రోజుల పాటు, 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచాలి. ఇలా 15 రోజులపాటు ఉంచితే పుట్టగొడుగుల మీద మైసిలియం ఏర్పడుతుంది, దీనిని స్పాన్ అని పిలుస్తాము, దీనిని 35 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వచేసుకోవచ్చు. స్పాన్ తయారుచేసే వారు చాలా జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. పుట్టగొడుగుల మదర్ కల్చర్, మరియు విత్తనాలను సీసాల్లో వేసిన తరువాత, సీసాలోకి గాలి చొరబడకుండా, శుభ్రమైన కాటన్ తో మూసెయ్యాలి. స్పాన్ సీసాల్లో ఆకుపచ్చ లేదా నల్లని రంగు ఏర్పడితే ఆ స్పాన్ చెడిపోయిందని గుర్తించవచ్చు.
Share your comments