Kheti Badi

మిరప పంటలో ఆకు ముడత తెగులు నివారణ కోసం ఇలా చేయండి

KJ Staff
KJ Staff
CHILLIS CROP
CHILLIS CROP

రైతులు పంట వేయడం ఒక ఎత్తు అయితే.. పంటను చిన్నపిల్లాడిలా కాపాడుకోవడం మరో ఎత్తు. పురుగులు, తెగులు లాంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటి నుంచి పంటను కాపాడుకున్నప్పుడే కాపు గా వచ్చి అధిక దిగుబడి వస్తుంది. లేకపోతే రైతులకు నష్టాలే మిగులుతాయి. పెట్టుబడి కోసం పెట్టిన డబ్బంతా వృధా అవుతుంది. పోలంకు రోజూ వెళ్లి పంటను చూసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా పరుగులు పడ్డాయా... తెగులు వచ్చిందా లాంటివి చూడాల్సి ఉంటుంది. పరుగులు, తెగుల నివారణకు రసాయనాలు పిచికారి చేయడం లాంటి తరచూ చేయాల్సి ఉంటుంది.

టైమ్ కి తెగులు, పురుగులను గుర్తించకపోతే పంటకు మరింత నష్టం జరుగుతుంది. సరైన సమయంకు గుర్తించకపోతే పంటను పురుగులు తినేసి బాగా నష్టం జరుగుతోంది. అలాగే తెగులును గుర్తించకపోతే పంటకు భారీ నష్టం జరుగుతోంది. తెగులు పట్టిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. రసాయనాలను పిచికారీ చేయాలి. అప్పుడే తెగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. అజాగ్రత్తగా ఉంటే ఇక అంతే సంగతులు.


ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంట ప్రధానమైనది. ఏపీలో గుంటూరు జిల్లాతో పాటు పలు జిల్లాలో ఈ పంటను ఎక్కువగా పండిస్తారు. మిర్చి పంటకు ఆకు మూడత తెగులు బాగా పట్టి పీడిస్తూ ఉంటుంది. దీనికి నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.

ఆకు మూడత తెగులు లక్షణాలు

ఆకు అంచులు పైకి చుట్టుకుపోవడం, ఈనెలు పసుపు రంగులోకి మారడం, ఆకు పరిమాణం తగ్గడం ఆకు మూడత తెగులు లక్షణం. ఈ తెగులు వల్ల ఆకు కాడలు కుదించుకోయి ఆనెలు ఉబ్బిపోతాయి. ఈ తెగులును గుర్తించకపోతే మొక్కల పెరుగుదల తగ్గిపోయి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.

బిగోమో వైరస్ ద్వారా తెగులు

బిగోమో వైరస్ వల్ల మిరప పంటలో ఆకు మూడత తెగులు వస్తుంది. ఈ వైరస్ 1.5 మి.మీ పొడవు, లేత పసుపు శరీరంతో మైనపు తెల్లని రెక్కలు కలిగి ఉంటుంది. ఆకుల దిగుబ భాగంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మొలకలు వచ్చే సమయంలో, పంట బాగా ఎదిగే సమయంలో ఈ తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. తెల్ల ఈగల తరహాలో ఈ వైరస్ ఉంటుంది.

తెగులు నివారణ ఎలా?

-ఇమిడాక్లోప్రిడ్ లేదా డైనోటెప్యూరాన్ వంటి మందులను పిచికారీ చేయడం ద్వారా ఈ ఆకు మూడత తెగులును నివారించవచ్చు. నాటు వేసేముందు మొలకలపై ఇమిడాక్లోప్రిడ్ లేదా లాంబ్ధా సైహలోధ్రిన్ ను పిచికారీ చేయాలి.

-వైరస్ సోకి మొక్కలను సేకరించి కాల్చడం ద్వారా ఈ తెగులను నివారించవచ్చు.

-పొలాన్ని దున్నిన తర్వాత మొక్కల ఆవవేషాలను కాల్చివేయండి

-పొలం చుట్టూ కలుపు మొక్కలు లేకుండా చూసుకోండి

-పసుపు జిగురు ఉచ్చులు లేదా షీట్లను మీ పొలంలో ఉంచండి

 

Related Topics

Chilli, Crop, Tegulu

Share your comments

Subscribe Magazine