Kheti Badi

మొక్కజొన్నలో అధిక నష్టం కలిగిస్తున్న కత్తెర పురుగు... నివారణ ఎలా?

KJ Staff
KJ Staff

ధాన్యపు పంటల్లో, వరి మరియు గోధుమ తరువాత అంతటి ప్రాముక్యత ఉన్న పంట ఏదైనా ఉందంటే, అది మొక్కజొన్న. ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో, మొక్కజొన్న ప్రధాన ఆహారం. మన దేశంలోని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళ్నాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ప్రాంతాల్లో మొక్కజొన్నను ఎక్కువుగా సాగు చేస్తారు. అయితే మొక్కజొన్న సాగులో అనేక రకాల చీడపీడల తరచూ పంటను ఆశిస్తూ పంట నష్టం కలిగిస్తాయి. ఇటువంటి చీడపీడల్లో కత్తెర పురుగు కూడా ఒకటి.


కత్తెర పురుగు దీనినే ఫాల్ ఆర్మీవార్మ్ అని కూడా పిలుస్తారు. ఈ పురుగు మొక్కజొన్న పంటపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దాదాపు మొక్కజొన్న సాగు చేసే అన్ని రాష్ట్రాల్లోని రైతులు కత్తెర పురుగుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ కత్తెర పురుగు, పురుగు మందులకు, రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేసుకుంది. దీంతో ఈ పురుగును కట్టడి చెయ్యడం రైతులకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. దీనిని కట్టడి చెయ్యడానికి వారానికి ఒకట్రెండు సార్లు మందులు పిచికారిచి చేసిన సారె ఫలితం లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు.

కత్తెర పురుగు అన్ని కాలాల్లోనూ వ్యాప్తి చెందుతుంది. దానియొక్క జీవితకాలం వేసవి కాలంలో 30 రోజులు కాగా, మిగిలిన కాలాల్లో 60 రోజుల వరకు ఉంటుంది. ఈ పురుగు ఒక్క పంటను ఆసిస్తే ఆ ప్రాంతంలోని మిగిలిన గ్రామాలకు కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ కత్తెర పురుగు జీవితకాలంలో 1000-1500 వరకు గుడ్లను పెట్టగలదు. అంతేకాకుండా ఈ పురుగు పగటిపూటా ఆకుల మధ్యలో ఉండి రాత్రిపూట ఆకులను తిని, పంటను నాశనం చేస్తుంది. కాబట్టి కత్తెర పురుగు పట్ల అప్రమత్తత వహించడం తప్పనిసరి, లేకుంటే తీవ్రమైన నష్టం చవిచూడవలసి వస్తుంది.

కత్తెర పురుగును నివారించడానికి రైతులు అదనంగా ఖర్చు చెయ్యవలసి వస్తుంది. ఒక ఎకరంలో మొక్కజొన్న సాగు చేస్తే 25 క్వింటాల్ దిగుబడి వస్తుండగా, సేద్యపు ఖర్చులు పోను 15,000 రూపాయిల వరకు మిగులుతుందని రైతులు చెబుతున్నారు, ఇదిలా ఉంటే, కత్తెర కారణంగా పంట తీవ్రంగా దెబ్బతింటుంది, దీనితో రైతులు అదనంగా ఖర్చు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ధానిని నివారించడానికి పురుగుమందులతో పాటు సమగ్ర యజమాన్య పద్దతులను కూడా పాటించవలసి ఉంటుంది.

కత్తెర పురుగు పురుగుమందులకు కూడా లొంగని పరిస్థితి ఏర్పడింది. దీని వలన కత్తెర పురుగును నివారించడానికి, రైతులు కొన్ని మెరుగైన యజమాన్య పద్దతులను పాటించాలి. విత్తనం నాటిన రెండు వారాల తరువాత, ఒక లీటర్ వేపనూనెను 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలపై, మరియు మట్టి మొత్తం తడిచేల పిచికారీ చెయ్యాలి. దీనివలన గుడ్ల నుండి పురుగులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా విత్తనం నాటిన 15-20 రోజుల వ్యవధిలో ప్రొఫెనోపాస్ 250 మిల్లీలీటరు ఒక లీటరు వేపనూనె, 200 లీటర్ల నీటిలో కలిపి మిశ్రమాన్ని చల్లుకోవాలి20 నుండి 30 రోజుల మధ్యలో ఎకరానికి ఇమామెక్టిన్ బెంజెయట్ 100 గ్రాములు, లీటరు వేపనూనెను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా మందులను మర్చి మర్చి వాడటం వలన మొక్కజొన్నను కత్తెర పురుగు నుండి కాపాడుకోవచ్చు.

Share your comments

Subscribe Magazine