మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం వంటివి మీకు నచ్చట్లేదా? వ్యవసాయం లాభసాటిగా లేదని బాధపడుతున్నారా? అయితే తక్కువ ఖర్చుతో ప్రారంభించగలిగే కీర దోస కాయల వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాలను పొందండి.
ఈ దోస కాయలను పండిస్తూ మంచి సంపాదన పొందే వీలుంటుంది. అంతే కాదు.. మీ కుటుంబానికి ఆర్గానిక్ పండ్లు, కూరగాయలను కూడా అందించే వీలు కూడా ఉంటుంది. వ్యవసాయంలోనూ ఎన్నో లాభసాటి మార్గాలుంటాయి. కానీ కీర దోస పండించడం వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందే వీలుంటుంది. ఇదెలా అని తెలుసుకోవాలంటే కీర దోసతో చేసే బిజినెస్ గురించి తెలుసుకోవాల్సిందే.
కీర దోస అనేది ఎండాకాలంలో పండించే పంట. అయితే మన దేశంలో ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి సంవత్సరం మొత్తం పండించవచ్చు. ఇది కేవలం అరవై నుంచి ఎనభై రోజుల్లో పండించగలిగే పంట. వానా కాలంలో మరింత సులువుగా, వేగంగా పండుతుంది. ఎండాకాలంలో ఈ పంటను పండించాలంటే ఫిబ్రవరి రెండో వారంలో దీన్ని నాటడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కీర దోస పండిస్తే మంచి లాభాలు లభిస్తాయి. ఈ పంట అన్ని రకాల పొలాల్లో పండుతుంది. కానీ ఒకవేళ మీకు మంచి దిగుబడి కావాలంటే మాత్రం నీటి లభ్యత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో దీన్ని నాటుకోవాలి. ఇసుక నేలలు, నీరు తక్కువగా ఉన్న నేలలు పనికొస్తాయి. వీటితో పాటు నదులు, చెరువుల ఒడ్డున కూడా వీటిని పండించడానికి అనువుగా ఉంటాయి. నేలలో పీహెచ్ 5.5 నుంచి 6.8 వరకు ఉండేలా చూసుకోవాలి.
యూపీకి చెందిన రైతులు నెదర్లాండ్ కీర దోసకాయలను పండించి మంచి లాభాలను పొందుతున్నారు.
నాలుగు నెలల్లో వారు ఎనిమిది లక్షల రూపాయలను పొందుతున్నారు. దీనికోసం వారు ప్రత్యేకమైన కీర దోస రకాల గింజలను నెదర్లాండ్స్ నుంచి తెప్పించుకున్నారు. ఈ కీర దోసలో ఎలాంటి గింజలు ఉండవు. అందుకే పెద్ద పెద్ద హోటళ్లలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలాగే కీర దోసలో ఉన్న ప్రత్యేక రకాలను పండించడం వల్ల మంచి ధర లభిస్తుంది.
కీరదోసకు సంవత్సరం మొత్తం డిమాండ్ ఉంటుంది. అయితే ఎండాకాలంలో వీటి డిమాండ్ మరింత పెరుగుతుంది. డిసెంబర్ లో వీటిని నాటుకుంటే ఏప్రిల్ వరకు వీటిని పొందే వీలుంటుంది. వీటిని సలాడ్లలో తినేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తారు. మార్కెటింగ్ బాగుంటే చాలు.. ఒక్కో కిలో ను 20 నుంచి 45 రూపాయలకు కిలో చొప్పున కూడా అమ్మే వీలుంటుంది. వీటిని అమ్మడానికి స్థానిక మార్కెట్లతో పాటు సోషల్ మీడియా సహాయం కూడా తీసుకోవచ్చు.
కీర దోస పండించేందుకు హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ నుంచి సబ్సిడీ కూడా లభిస్తుంది. యూపీ కి చెందిన ఓ రైతు దీన్ని పండించేందుకు గింజలు, ఇతర ప్రయోజనాలకు గాను 18 లక్షల సబ్సిడీని పొందారట. నెదర్లాండ్స్ నుంచి ఈ విత్తనాలను 72 వేల రూపాయలు పెట్టి మరీ తెప్పించుకున్నాడీ రైతు. దీనివల్ల గింజలు లేని ఈ కీర దోస కేవలం నాలుగు నెలల్లో కోతకు సిద్ధమవుతాయి. మామూలు కీర దోస కంటే ఇవి రెండు రెట్ల ఖరీదు కలిగి ఉంటాయి.
https://krishijagran.com/agripedia/know-how-to-grow-cucumber-at-home/
https://krishijagran.com/agripedia/best-cucumber-varieties-available-in-indian-market/
Share your comments