Kheti Badi

మొక్కజొన్న పంట సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించండిలా

KJ Staff
KJ Staff

మన తెలుగు రాష్ట్రంలోని రైతులకు మొక్కజొన్న యాజమాన్య పద్దతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరి తరువాత విస్తృతంగా సాగు చేసే పంటల్లో మొక్క జొన్న ఒకటి. దీనిని ఖరీఫ్ పంటగా సాగుచేస్తారు, నీటి లబ్యత ఉన్నవారు వేసవి కాలంలోనూ మొక్క జొన్నను సాగు చేస్తూ ఉంటారు. మిగిలిన ధాన్యం పంటలతో పోలిస్తే మొక్కజొన్నకు నీటి అవసరం కూడా తక్కువే. మొక్కజొన్న యాజమాన్యంలో పాటించవలసిన కొన్ని సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కజొన్నను మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఖరీఫ్ పంటగా సాగుచేస్తారు. ఈ పంటను ఇసుకతో కూడిన రేగడి, గరప, మరియు లోతైన మధ్యరకపు నేలల్లో సాగు చెయ్యడానికి అనుకూలం. నేలలో ఉదజని సూచిక 6.5 నుండి 7 మధ్య ఉండేలా చూసుకోవాలి. మురుగునీరు ఎక్కువుగా నిలిచే నేలలు, ఆమ్లా, క్షర చౌడు మొదలగు రకాల నేలలు పంట సాగుచెయ్యడానికి అనుకూలించవు.

పంటల సాగులో యాజమాన్య పద్ధతులు ఎంత ప్రభావం చూపుతాయో మేలైన విత్తన రకాన్ని ఎంచుకోవడం కూడా అంతే ప్రభావం చూపుతాయి, పంట నాణ్యత మరియు దిగుబడి పెరగాలన్న మేలైన రకం విత్తనాన్ని ఎంచుకోవాలి. వాతావరం మార్పులకు తట్టుకొని నిలబడగలిగే రకాన్ని ఎంచుకోవడం ఉత్తమం. మన దగ్గర అందుబాటులో ఉన్నరకాల్లో డిహెచ్ ఎం-103, 105, 107, 109, త్రిశూలత, బిహెచ్-2187 మొదలైనవి మేలైన సంకరజాతిరకాలు.

ఖరీఫ్ పంటగా సాగుచేసే రైతులు జూన్ 15 నుండి జులై 15 లోపు విత్తనాలను విత్తుకోవాలి, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్నను రబి పంటగా కూడా సాగుచేస్తారు అటువంటి రైతులు అక్టోబర్ 15 నుండి డిసెంబర్ 15 లోగ విత్తుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వర్షాధారితంగా సాగుచేసే రైతులు మాత్రం ఖరీఫ్ పంటగా సాగుచేస్తేనే ఉత్తమం. ఒక ఎకరానికి ఎంచుకున్న రరకాన్ని బట్టి 4-5 కిలోల విత్తనం అవసరం అవుతుంది. విత్తుకునే ముందు విత్తనశుద్ధి చెయ్యాలి దీని వలన మొక్క ఎదిగే దశలో ఆశించే చీడపీడల నుండి మొక్కలను కాపాడుకోవచ్చు. దీనికోసం ఒక లీటర్ నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా 5 గ్రాముల ఇమిడాక్లోరోఫిడ్ కలిపినా ద్రావణంలో 2-3 గంటలు నానబెట్టిన విత్తనాలను విత్తుకోవాలి. విత్తే దూరం వరసల మధ్య 60-75 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 20-25 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి.

మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యాన్ని సమయానుసరంగా పాటించవలసి ఉంటుంది. ఆఖరిదుక్కులో ఎకరానికి 3 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నుకోవాలి, మొక్కజొన్నపంటకు మొత్తం 40 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాష్ ఎరువులు అవసరమవుతాయి, నత్రజని ఎరువులో సగభాగం అంటే 20 కేజిలో విత్తనం విత్తే సమయంలో మరియు మిగిలిన సగభాగాన్ని విత్తనం నాటిన 50-55 రోజుల మధ్యలో మొక్కలకు అందించాలి, మిగిలిన భాస్వరం మరియు పోటాష్ ఎరువులను విత్తే సమయంలో వెయ్యాలి. మొక్కజొన్న సాగులో సూక్ష్మధాతువైన జింక్ లోపం ప్రధానంగా కనిపిస్తుంది. జింక్ లోపించిన మొక్కల్లో ఆకులు పసుపురంగులోకి మారడం, ఎదిగే పైరు మొక్కల్లో ఆకులు తెలుపు రంగులోకి మారడం గమనించవచ్చు, దీనికి పరిష్కారంగా 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కల ఆకులపై పిచికారీ చెయ్యాలి.

మొక్కజొన్నలో నీటి యాజమాన్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. విత్తనం నాటిన తర్వాత మొక్క 5-6 సెంటీమీటర్ల ఎత్తుఎదిగేంత వరకు పొలంలో నీరు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలి. మొక్కలోని కొన్ని ప్రధాన దశల్లో నీరు పెట్టడం అవసరం, పూత ముందు దశ, పూత పూసే దశ మరియు పాల దశలో నీటిని అందించడం అత్యంత కీలకం. పొలంలో నీరు నిలవకుండా ఉండేందుకు బోదెలను ఏర్పాటుచేసుకోవాలి. మొక్కజొన్నలో సమగ్ర కలుపు నివారణ చర్యలు పాటించడం ఎంతో అవసరం. విత్తనం నాటిన నాటినుండి మొక్కఎదిగేంత వరకు పొలంలో కలుపు లేకుండా చర్యలు చేపట్టాలి. చేతితో కలుపు మొక్కలను నివారించడం, వరుసల మధ్య కల్టివేటర్ తో అంతర్ కృషి చెయ్యడం ఉత్తమం. కలుపు ఉదృతి మరీ ఎక్కువుగా ఉంటే అప్పుడు ఒక ఎకరానికి కిలోన్నర ఆత్రజని 50శాతం పొడిని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనం నాటిన తరువాత పొలం మొత్తం పిచికారీ చెయ్యాలి.

 

  1. రారండోయ్ 'దొండ' సాగు చేపడదాం....

  2. బొప్పాయిలో వైరస్ వ్యాధిని ఎలా నియంత్రించాలి?

  3. విత్తన నిల్వలో పాటించవలసిన జాగ్రత్తలు

Share your comments

Subscribe Magazine