తెలుగు రాష్ట్రాల్లో పండించే అతి ముఖ్యమైన పంటల్లో మిరప పంట ఒకటి. ప్రపంచంలోనే ఇండియాలో మిర్చి పంట ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఏపీలోని గుంటూరు జిల్లాలో ప్రపంచంలోనే అది పెద్దదిగా పేరొందిన మిర్చి యార్డ్ ఉంది. తెలుగు వంటల్లో మిర్చికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. చాలా కూరల్లో మిర్చిని ఉపయోగిస్తారు. ఇక మిర్చి బజ్జి తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్. ఇక మిర్చి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారానికి రుచి ఇవ్వడమే కాక మిర్చిలో అనేక విటమిన్లు, ఔషధ లక్షణాలు ఉన్నాయి.
మిర్చి పంటకు అనుకూలమైన నేలలు
వర్షాధారపు పంటకు అయితే నల్ల నేలలు మిర్చి పంటకు అనుకూలం
ఇక నీటి ఆధారపు పంటలకు నల్ల నేలలు, చల్కా నేలలు, ,లంక భూములు ,ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం
పంటకు అనుకూలంగా నేల తయారీ చేయడం ఎలా?
మొదట మెత్తటి దుక్కి దున్నాలి. 3 నుంచి 4 సార్లు దుక్కి దున్నాలి. ఆ తర్వాత 2 సార్లు గుంటక తోలాలి.
విత్తనం వేయి పద్దతి
ఖరీఫ్ పంట వచ్చి జులై, ఆగస్టులో వేయాలి. రబీ పంట అయితే అక్టోబర్, నవంబర్ నెలలో వేయాలి
నారు వేయడానికి సెంటుకు 650 గ్రాములు, విత్తనం ఎద పెట్టుటకు ఎకరాకు 2.5 కిలోల విత్తనం కావాల్సి వస్తుంది.
ఇక కిలో మిరప విత్తనానికి మొదటగా వైరస్ తెగులు నివారణకు 150గ్రా.ట్రైసోడియం ఆర్ధోఫాస్ఫేట్ శుద్ది చేయాలి. ఆ తర్వాత రసం పీల్చే పురుగుల నివారణకు 8 గ్రా.ఇమిడాక్లోప్రిడ్ శుద్ది చేయాలి. అలాగే ఇతర తెగుళ్ళ నివారణకు 3గ్రా.కాప్టాన్ లేదా 3గ్రా.మాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేయాలి
నాటు వేయడం ఎలా?
6 వారాల వయస్సు ఉన్న మొక్కలు నాటడానికి అనుకూలం.
వర్షాదారపు పైరుకు 56 15సెం.మీ దూరంలో పాదుకు ఒక మొక్క చొప్పున నాటాలి.
ఇక నీటి వసతి గల పంటకు 56 56 లేదా 60 60 లేదా 90 60 సెం.మీ ఎడం చొప్పున పాదుకు 2 మొక్కల చొప్పున నాటాలి.
మిరపలో రకాలు
లాం-334(యల్.సి.ఎ-334)
కాయలు పొడవుగా అవుతాయి. ఎక్కువ కారంగా అనిపిస్తాయి. అన్ని రకాల కంటే దిగుబడి ఎక్కువ ఇస్తుంది.దిగుబడి ఎకరాకు 24-26క్వింటాళ్ళు వస్తుంది
లాం-305 (యల్.సి.ఎ-305)
పొడవైన ,లావైన కాయలు వస్తాయి. పచ్చి మిర్చికి ,ఎండుమిర్చికి ,నీటి ఆధారపు పైరుకు ఈ రకంఅనుకూలం. దిగుబడి కూడా బాగానే ఉంటుంది. ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్ళు వస్తుంది.
సింధూర్(సి.ఎ.960)
ఈ రకం పంట వేస్తే కాయలు పొడవుగా, లావుగా వస్తాయి. త్వరగా పంట కాపుకొస్తుంది.కారం తక్కువగా ఉంటుంది .వేసవి పైరుకు అనుకూలమైన రకం ఇది.దిగుబడి ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్ళు ఉంటుంది.
జి-౩
పొడవు కాయలు వస్తాయి. వర్షాధారపు పైరుకు ఈ రకం అనుకూలం. దిగుబడి వర్షాధారంగా ఎకరాకు 6-7.2 క్వి౦టాళ్ళు ఉంటుంది. ఇక నీటి వసతి క్రింద 10-12 క్వి౦టాళ్ళు వస్తుంది.
జి-4(భాగ్యలక్ష్మి)
కాయలు సన్నగా,పొడవుగా ఉంటాయి. పచ్చికాయకు, ఎండుకాయకు అనుకూలమైర రకం ఇది. వైరస్ ను తట్టుకొంటుంది. దిగుబడి ఎకరాకు 16-18 క్వింటాళ్ళు ఉంటుంది.
Share your comments