కంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించే పంట. ఎక్కువగా దిగుబడి వచ్చే పంటతో పాటు రైతులకు అధిక దిగుబడి తీసుకొచ్చే పంట కూడా ఇదే. మన తెలుగు వంటకాల్లో పప్పుకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. వారానికి ఒకసారైనా పప్పుతో అన్నం తింటారు. ఇక పెళ్లిళ్లకు, ఫంక్షన్లలో మెనూలో పప్పు తప్పనిసరిగా ఉంటుంది. వెజిటేరియన్స్ బాగా ఇష్టపడే వంటకం కూడా ఇదే. పప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు శరీరానికి బలం వస్తుంది. అనేక విటమిన్లు, ప్రోటీన్లు పప్పు దినుసుల్లో ఉన్నాయి. అందుకే పప్పు దినుసులకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటూ ఉంటుంది
రబీతో పాటు ఖరీఫ్‌లోనూ కంది పంటను పండించవచ్చు. కొంతమంది మిశ్రమ పంటగా వేరే పంటతో కలిపి కందిని సాగు చేస్తారు. పెసర, మినుము, సోయచిక్కుడు, వేరుశెనగ పంటతో కలిపి ఈ పంటను కూడా చేస్తారు. అసలు కంది పంటను ఎలా పండించాలి. ఎలా చేస్తే అధిక దిగుబడి వస్తుంది. కంది పంట యాజమాన్యం గురించి సమగ్ర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నేల ఎంపిక
నీరు త్వరగా ఇంకిపోయే గరప,ఏఱ రేగడి,చల్కా నేలల్లో, మురుగు నీరు పోయే వసతి గల నల్ల రేగడి నేలలు కంది పంగ సాగు చేయడానికి బాగా అనుకూలం.చౌడు నేలలు,నీటి ముంపుకు గురయ్యే నేలలు కంది పంట సాగుకు పనికి రావు. పోలంలో రెండుసార్లు నాగళ్లతో దన్ని మొత్తగా తయారుచేసుకున్న తర్వాత పంట వేయాలి.
విత్తన శుద్ధి ఎలా?
నాగలి వెంబడి లేదా సాళ్లలో గోర్రుతో విత్తనం నాటాలి. రైజోబియంను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి వస్తుంది. ఖరిఫ్ లో నల్ల రేగడి నేలల్లో 150X12లేదా 180X10సెం.మీ(వరసుల మధ్య మొక్కల మధ్య) నాటాలి. ఇక ఎర్ర నేలల్లో 90X20 సెం.మీ రబీలో వర్షాధారంగా 45-60X10,ఆరుతడి పంటగా 75-90X10సెం.మీ. మధ్య నాటాలి. ఖరీఫ్ లో కృష్ణా-గోదావరి,దక్షిణ మండలం, ఉత్తర కొస్తా మండలాల్లో జూన్-జూలై నెలల్లోను నాటుకోవచ్చు. ఇక రబీలో ఉత్తర,దక్షిణ తెలంగాణాల్లో సెప్టెంబరు లోనూ నాటుకోవచ్చు. కృష్ణా-గోదావరి,దక్షిణ మండలం,ఉత్తర కొస్తా మండలాల్లో సెప్టెంబరు-అక్టోబరు నెలల్లోను విత్తుకోవచ్చు.
విత్తన రకాలు
పల్నాడు(ఎల్.ఆర్.జి.30)
ఈ రకం మొక్క గుబురుగా పెరిగి కాపు మీద ప్రక్కలకు వాలి పోతుంది. అలాగే పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి. ఇక గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. అన్ని ప్రాంతాలకు ఇది అనువైన రకం . ఈ రకం రబీకి కూడా అనుకూలం. అయితే ఈ రకం పంట ఎండు,వెర్రి తెగుళ్ళను తట్టుకోలేదు. దీని పంటకాలం రబీలో 120 నుంచి 130 రోజులు ఉంటుంది. ఖరీఫ్ లో అయితే 170 నుంచి 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది
మారుతి(ఐ.సి.పి.8863) రకం
ఈ రకం మొక్క నిటారుగా పెరుగుతుంది.ఎండు తెగులను తట్టుకొగలదు. గింజలి మధ్యస్థలాపుగా ఉంటాయి. వారి మాగాణి గట్ల మీద పెంచటానికి ఈ రకం చాలా అనువైనది. ఖరీఫ్ లో పంట 155 నుంచి 180 రోజులకు వస్తుంది. దిగుబడి 8 క్వింటాళ్ల వరకు వస్తుంది.
అభయ(ఐ.సి.పి.ఎల్.332) రకం
ఈ రకం మొక్కలు నిటారుగా పెరిగి కాయలు గుత్తులుగా కాస్తాయి. గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. అలాగే కాయ తొలుచు పురుగును కొంతవరకు తట్టు కొంటుంది. ఖరిఫ్ పంట 160-165 రోజుల్లో చేతికి వస్తుంది. దిగుబడి 9 క్వింటాళ్ల వరకు వస్తుంది.
లక్ష్మి(ఐ.సి.పి.ఎల్.85063) రకం
చెట్లు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటాయి. ఇది ఎండు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.రబీలో విత్తినప్పుడు ప్రధానమైన కొమ్మలు ఎక్కువగా ఉండి,ఎక్కువ దిగుబడి వస్తుంది. గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. పంటకాలం 160 నుంచి 180 రోజులు ఉంటుంది. దిగుబడి 8 క్వింటాళ్ల వరకు వస్తుంది.
రకం-దుర్గా
అధిక దిగుబడినిచ్చే స్వల్ప కాలిక రకం ఇది. కాయతొలుచు పురుగు బారి నుండి తప్పించుకుంటుంది. ఉత్తర తెలంగాణా జిల్లాలకు ఖరిఫ్ పంటగా ఇది అనువైనది. పంటకాలం ఖరిఫ్ 115-125 రోజులు ఉంటుంది. దిగుబడి 4.8 నుంచి 6 క్వింటాళ్ల వరకు ఉంటుంది.
రకం-పి.ఆర్.జి-100
ఈ రకం ఎండు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.తెలంగాణ, రాయల సీమలోని తేలిక పాటి, ఎర్ర చల్కా నేలల్లో వర్షాధారంగా సాగుచేయటానికి ఈ రకం చాలా అనువైనది. పంటకాలం ఖరీఫ్ సీజనలో 140 నుంచి 150 రోజుల్లో చేతికి వస్తుంది. 8 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది.
డబ్ల్యు.ఆర్.జి-27 రకం పంట
మొక్కలు బాగా ఎత్తుగా పెరుగుతాయి. పువ్వులు ఎరుపుగా ఉంటాయి. కాయలు ఆకుపచ్చగా ముదురు గోధుమ రంగు చారలు కలిగి ఉంటాయి. ఈ రకంగ గింజలు గోధుమ వర్ణంలో ఉంటాయి. పంటకాలం వచ్చి ఖరీఫ్ లో 180, రబీలో 120 నుంచి 130 రోజులు ఉంటుంది. దిగుబడి 8 నుంచి 8.8 క్వింటాళ్ల వరకు ఉంటుంది. ఖరీఫ్ 180 రోజులు, రబీ సీజన్ లో 130 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది.
ఎరువులు
చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేయాలి. ఇక ఖరీఫ్ లో 8 కిలోలు, రబీలో 16 కిలోలు నత్రజని వేయాలి. ఈ రెండు కాలల్లోను 20 కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి. ఇక అంతరమైన వేసినప్పుడు పైరును బట్టి వేసే ఎరువు మోతాదు మారుతుంది.ప్రధాన పైరుకు,అంతర పంటకు వేరువేరుగా ఎరువులు వేయాలి.
Share your comments